దర్శకుడు టిను వర్మ అరెస్టు | Action director Tinu Verma arrested | Sakshi
Sakshi News home page

దర్శకుడు టిను వర్మ అరెస్టు

Published Thu, Aug 29 2013 7:23 PM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

Action director Tinu Verma arrested

ముంబై:ఆస్తి తగాదా విషయంలో సవతి సోదరుడిపై దాడి చేసిన బాలీవుడ్ సినీ దర్శకుడు టిను వర్మను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్టు చేశామని కురార్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌డీ డఫ్లే తెలిపారు. గత కొన్నేళ్లుగా గుర్గావ్‌లో ఉన్న కుటుంబానికి చెందిన ఫాంహౌస్ విషయమై సవతి సోదరుడు మనోహర్ వర్మతో టిను వర్మకు గొడవలు ఉన్నాయన్నారు.

 

అయితే ఈ నెల 23న వీరిమధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసిందన్నారు. టినూ వర్మ ఆవేశంలో మనోహర్‌పై కత్తితో దాడి చేశాడన్నారు. అయితే తనవాటాకు సంబంధించిన ప్రాంతాన్ని మనోహర్ కబ్జా చేశాడని టినూ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement