జంటలను వేధించవద్దు: యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా యువతులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నిరోధించడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాంటీ రోమియో స్క్వాడ్‌లతో ఆకతాయిలకు చెక్ పెట్టే కార్యక్రమాన్ని అక్కడ అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో యోగి పాలనలో పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ సిబ్బంది.. అమాయక యువత, జంటలపై వేధింపులకు పాల్పడవద్దని యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు సూచించారు. ఈ మేరకు యూపీ శాంతిభద్రతల అదనపు డీజీ దల్జీత్ చౌదరి అమాయకులను వేధించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.