adithyanath
-
‘ఏబీ’పై మరో విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలను తోసిరాజని పేట్రేగిపోయిన ఇంటెలిజెన్స్ విభాగం మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో విచారణకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశభద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా.. రక్షణ పరికరాల కొనుగోలులో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడినందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనను గతంలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణ సమయంలో ఏబీ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం, పలువురు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం తాజా విచారణకు ఆదేశాలిచ్చింది. ఆలిండియా సర్వీసు (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు–1969లోని నిబంధన–8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాకు విచారణ బాధ్యతలు అప్పగించారు. న్యాయవాది సర్వ శ్రీనివాసరావును ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. విచారణ పూర్తి చేశాక ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కాగా, ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలకు సంబంధించి ఫోర్జరీ (నకిలీ) పత్రాలు పెట్టిందంటూ ఏబీ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే సమయంలో ఏబీ సమర్పించిన పలు పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మీడియాకు ఏబీ ఇచ్చిన లీకులు, పత్రాలు కూడా తప్పుడివేనని నిర్ధారించింది. తొలి విచారణ జరుగుతున్న సమయంలో హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలనే ఆదేశాలను కూడా ఏబీ ఉల్లంఘించారు. -
శ్రీశైలం విద్యుత్‌ను 50:50 శాతం వాడుకోవాలని నిర్ణయం
-
నోరు మూయించిన ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. యోగి, మేనక, మాయ మతవిద్వేష వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేత జయప్రద వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఆజంఖాన్ మాట్లాడారు. విద్వేష వ్యాఖ్యల అంశంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఈసీ చీవాట్లు పెట్టింది. యోగి, ఆజంఖాన్‌లు గతంలోనూ ఇలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వారిని ఈసీ హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో వారిద్దరిపై 72 గంటల నిషేధం విధించామని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. అదే మాయ, మేనకలు తొలిసారి విద్వేష వ్యాఖ్యలు చేసినందున వారిపై 48 గంటల నిషేధమే విధించామన్నారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఈసీ అధికారి చెప్పారు. ఈ ఎన్నికలు అలీకి, బజరంగ్ బలికి మధ్య జరిగే యుద్ధమని మీరట్‌లో యోగి అన్నారు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయకూడదని దేవబండ్‌లో మాయావతి కోరారు. ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తర్వాత వారు ఏదైనా పనికోసం తన వద్దకు వచ్చినప్పుడు వారికి సాయం చేయాలని తనకు అనిపించదని మేనక పేర్కొన్నారు. ఇక జయప్రదకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాలపై ఆజంఖాన్ మాట్లాడుతూ జయప్రద ఖాకీ నిక్కర్ వేసుకుంటుందని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ నేత ఆజం ఖాన్‌లపై ఈసీ నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే.. విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు బెంచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధగంటలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తమ ముందు ఉండాలని కూడా ఓ సందర్భంలో హెచ్చరించింది. -
జంటలను వేధించవద్దు: యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా యువతులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నిరోధించడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాంటీ రోమియో స్క్వాడ్లతో ఆకతాయిలకు చెక్ పెట్టే కార్యక్రమాన్ని అక్కడ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో యోగి పాలనలో పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ సిబ్బంది.. అమాయక యువత, జంటలపై వేధింపులకు పాల్పడవద్దని యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు సూచించారు. ఈ మేరకు యూపీ శాంతిభద్రతల అదనపు డీజీ దల్జీత్ చౌదరి అమాయకులను వేధించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.