ఆ పుస్తకాన్ని నిషేధించలేం: కోర్టు | Ahmedabad court refuses to ban Gujarati satire book "Feku Ji Have Delhi Ma" | Sakshi
Sakshi News home page

ఆ పుస్తకాన్ని నిషేధించలేం: కోర్టు

Published Thu, Jun 30 2016 5:45 PM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

ఆ పుస్తకాన్ని నిషేధించలేం: కోర్టు - Sakshi

ఆ పుస్తకాన్ని నిషేధించలేం: కోర్టు

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ రాసి ప్రచురించిన ఒక పుస్తకాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఏఎమ్ దవే ఈ కేసును పరిశీలిస్తూ.. ఆర్టికల్ 19ను ఉదహరించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా ‘ఫేకూజీ హ్యావ్ ఢిల్లీ మా’ అనే పేరుతో మోదీపై వ్యంగ్యంగా పుస్తకం రాసి ప్రచురించారు. ముఖ్యంగా 2014 లోక్‌సభ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త నర్సింగ్ సోలంకీ కోర్టులో దావా వేశారు. ఈ పుస్తకం మోదీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగేటట్లు ఉందని సోలంకీ  ఆరోపించారు. ప్రధానిగా మోదీ ఎన్నికై కేవలం రెండేళ్లేనని, స్వల్ప వ్యవధిలో అన్ని హామీలు నెరవేర్చడం కష్టమన్నారు.

సోలంకీ వాదనలతో సంతృప్తి చెందని న్యాయమూర్తి పుస్తక రూపంలో తమ భావాలను తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ పుస్తకం దేశసార్వభౌమత్వానికి, ఐక్యతకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఈ పుస్తకం అమ్మకాలు, ప్రచురణపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement