భారత ఎయిర్‌ చీఫ్‌ ‘సేఫ్’ : ఐఏఎఫ్‌ | Air Chief Marshal Bhadauria is Safe : Air Force | Sakshi
Sakshi News home page

భారత ఎయిర్‌ చీఫ్‌ ‘సేఫ్’ : ఐఏఎఫ్‌

Published Thu, Dec 5 2019 10:53 AM | Last Updated on Thu, Dec 5 2019 12:12 PM

Air Chief Marshal Bhadauria is Safe : Air Force - Sakshi

హవాయి : ఐఏఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ బదౌరియా క్షేమంగా ఉన్నారని వైమానిక దళ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. వివరాలు.. ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతపై చర్చించడానికి అమెరికా మిలిటరీ స్థావరమైన హవాయిలోని పెర్ల్‌ హార్బర్‌లో వివిధ దేశాల వాయుసేనాధ్యక్షులతో ఓ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి బదౌరియా అక్కడికి వెళ్లారు. అయితే బుధవారం పెర్ల్‌ హార్బర్‌ నౌకాశ్రయంలో ఓ సెయిలర్‌ ముగ్గురిని కాల్చి చంపేసి అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోబదౌరియా పెర్ల్‌హార్బర్‌లోని ఎయిర్‌ బేస్‌లో ఉన్నారని, కాల్పుల ఘటన నౌకాశ్రయంలో జరిగిందని అధికార ప్రతినిధి వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement