
అఖిలేశ్ ఉత్తమ సీఎం: ములాయం
మెయిన్‌పురి: దేశంలోకెల్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తనయుడు అఖిలేశ్ ఉత్తమ ముఖ్యమంత్రి అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కొనియాడారు.
2017 శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్‌ను ములాయం ప్రకటించారు. కచ్చితంగా అఖిలేశ్ దేశంలోనే ఉత్తమ సీఎం అని ప్రశంసించిన ఆయన రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి పేదలు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాడని పేర్కొన్నారు.