CM Akhilesh yadav
-
మా ‘తుపాను’లో మోదీ కొట్టుకుపోతారు
ప్రచారంలో రాహుల్, అఖిలేశ్ మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌లు బీజేపీ, బీఎస్పీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. మీరట్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ఉత్తరప్రదేశ్ శాంతి, సామరస్యంతో ఉండే రాష్ట్రం అనీ, ఇక్కడి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తే సహించబోమని అన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల పొత్తు కుదిరిన రోజే ఓ తుపాను రాష్ట్రంలో మొదలైందనీ, దాని ధాటికి ప్రధాని మోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. అఖిలేశ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఏదైనా తుపాను ఉందంటే అది సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ల విజయానికి దోహదపడేదేనని పేర్కొన్నారు. తుపానులోనూ సైకిల్‌ను ఎలా తొక్కాలో తమ పార్టీ శ్రేణులకు తెలుసునన్నారు. -
అఖిలేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ
- ‘17 బీసీ ఉపకులాలకు ఎస్సీ హోదా’ ఉత్తర్వులపై స్టే - ఎన్నికల వేళ సంచలనంగా మారిన అలహాబాద్ హైకోర్టు తీర్పు అలహాబాద్: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నవేళ ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేశ్ యాదవ్ సర్కారుకు ఎదురుదెబ్బతగిలింది. 17 వెనుకబడిన తరగతి ఉప కులాను షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ) కేటగిరీలో చేర్చుతూ గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. దీంతో బీసీలను ఆకట్టుకోవాలనుకున్న అఖిలేశ్ ప్రయత్నాలకు గండిపడినట్లైంది. సీఎం అఖిలేశ్ అధ్యక్షతన డిసెంబర్ 22న హడావిడిగా సమావేశమైన యూపీ కేబినెట్.. అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలను ఎస్సీల్లో చేర్చాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కొద్ది గంటల్లోనే జీవో కూడా జారీ అయింది. కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, భర్, ప్రజాపతి, బథం, గౌర్, తురా, మాఝీ, మలా, కుమ్హార్, ధీమర్, మచువా తదితర కులాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్దిచేకూరినట్లైంది. అయితే సరిగ్గా నెల రోజులకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. యూపీ ఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యయనం రిపోర్టు మేరకు కులాల విలీనానికి సంబంధించిన తీర్మానాన్ని 2013లోనే అసెంబ్లీ ఆమోదించింది. కానీ, జీవో మాత్రం సరిగ్గా ఎన్నికల ముందు విడుదలైంది. దీంతో విపక్ష బీఎస్పీ సహా ఇతర పార్టీలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. విచిత్రం ఏమంటే, 2004లోనూ నాటి సీఎం ములాయం ఇవే బీసీ ఉప కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేర్చేందుకు జీవోను జారీచేశారు. అప్పుడు కూడా హైకోర్టు జోక్యంతోనే ఆ ఆదేశాలు చెల్లుబాటుకాలేదు. -
బ్రేకింగ్: ములాయం-అఖిలేశ్ సంధి
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ముగిసింది. గత కొన్ని గంటలుగా కొనసాగుతున్న యాదవ్ పరి'వార్' హైడ్రామాకు తెరపడింది. నిట్టనిలువునా చీలిపోయేందుకు సిద్ధపడిన ఎస్పీ.. తండ్రి-కొడుకుల రాజీతో కుదురుకుంది. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్‌లతో ఎస్పీ సీనియర్ నేత, మంత్రి ఆజంఖాన్ నెరిపిన దౌత్యం ఫలించింది. దీంతో అఖిలేశ్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌పై ఆరేళ్ల సస్పెన్షన్‌ను ఎస్పీ ఎత్తివేసింది. వారిద్దరిని తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకుముందు ఉదయం నుంచి యూపీలో అనేక నాటకీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనను బహిష్కరించడంతో సీఎం అఖిలేశ్ యాదవ్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తన నివాసంలో భేటీ నిర్వహించారు. ఈ భేటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏకంగా ఎస్పీ 190 మంది ఎమ్మెల్యేలు, 35మందికి పైగా ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరై అబ్బాయికి జైకొట్టారు. ఈ పరిణామంతో ప్రత్యర్థి శివ్‌పాల్ యాదవ్ వర్గం బిత్తరపోయింది. ఇంతలోనే తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల జాబితా తీసుకొని చివరి ప్రయత్నంగా అఖిలేశ్ ములాయం ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న సీనియర్ మంత్రి ఆజంఖాన్ ఇటు ములాయంతో, అటు అఖిలేశ్‌తో వేర్వేరుగా సమావేశమై.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో అఖిలేశ్‌పై, రాంగోపాల్ యాదవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ములాయం అంగీకరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని సీఎం అఖిలేశ్‌ను, ఆయన సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ చీఫ్ ములాయం ఆరేళ్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, అఖిలేశ్ తన బలప్రదర్శన నిరూపించుకొని, ఆధిపత్యాన్ని చాటుకున్న తర్వాత ములాయం మెత్తబడటం గమనార్హం. ఎస్పీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నేతలు అఖిలేశ్‌కు జైకొట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ములాయం అండగా ఉన్న శివ్‌పాల్ వర్గం వెనుకకు తగ్గినట్టు తెలుస్తోంది. ఈ దౌత్యంలో సమీప బంధువు, లాలూప్రసాద్ యాదవ్ కూడా కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఆధిపత్య పోరుకు తెరతీసిన అభ్యర్థుల ఎంపిక అంశంపై ఇకముందు నేతలంతా కలిసి కూచోని మాట్లాడుకుంటామని శివపాల్ యాదవ్ అంటున్నారు. -
నాన్నకు ప్రేమతో.. అఖిలేశ్ ఉద్వేగ ప్రసంగం!
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ తనను ఆరేళ్లపాటు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భావోద్వేగంగా స్పందించారు. తాను ఇప్పటికీ నాన్నతోనే ఉన్నానని ఆయన అన్నారు. ఎస్పీలో ముసలం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆయన శనివారం తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. తాను బహిష్కరణకు గురయింది పార్టీ నుంచే కానీ, కుటుంబం నుంచి కాదని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. దానిని నాన్న ములాయంకు బహుమతిగా ఇద్దామని అఖిలేశ్ పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాతో తండ్రి ములాయం ఆశీర్వాదం తీసుకునేందుకు ఆయన ఇంటికి అఖిలేశ్ బయలుదేరారు. ఎస్పీని చీల్చి సొంతంగా పార్టీ పెట్టే దిశగా అఖిలేశ్ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎస్పీ నుంచే కాకుండా జాతీయ నేతల మద్దతు కూడా లభిస్తుండటం గమనార్హం. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అఖిలేశ్ ఫోన్ చేసి మాట్లాడగా.. కాంగ్రెస్ పార్టీ ఆయనతో పొత్తుకు సై అని సంకేతాలు ఇచ్చింది. -
అఖిలేశ్ నివాసం వద్ద హైడ్రామా!
లక్నో: ఎస్పీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నివాసం వద్ద నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ అఖిలేశ్‌ను, ఆయన చిన్నాన్న రాంగోపాల్ యాదవ్‌ను ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణ కోసం అఖిలేశ్ యాదవ్ తన నివాసంలో ఎస్పీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి పెద్ద ఎత్తున అఖిలేశ్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. మొత్తం 12 మంది మంత్రులు, 150 మంది ఎమ్మెల్యేలు, 35మంది ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎస్పీపై సీఎం అఖిలేశ్ పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు పలికారు. మరోవైపు అఖిలేశ్ ప్రత్యర్థి శివ్‌పాల్ యాదవ్ శిబిరంలో కొంత నిరాశ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అబ్బాయికి జై కొట్టడంతో బాబాయి మిగతా వారిని పోగేసి.. భవిష్యత్తు కార్యాచరణ కోసం సమయాత్తమవుతున్నారు. ఈ భేటీ నేపథ్యంలో అఖిలేశ్ నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు, ఎస్పీ కార్యకర్తల సందడి కనిపిస్తోంది. అఖిలేశ్‌కు మద్దతుగా, శివ్‌పాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. అఖిలేశ్ నివాసం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ యువనేతకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుండటం గమనార్హం. తాము ఎస్పీ సుప్రీం ములాయంను ధిక్కరించడం లేదని, కానీ రానున్న ఎన్నికల్లో ఎస్పీ సీఎం అభ్యర్థిగా అఖిలేశ్యే ఉండాలని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. -
భరించలేను.. గుండె బద్దలవుతోంది..
న్యూఢిల్లీ: ‘ప్రతిమనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. నా సహనానికి కూడా ఒక హద్దుంది. ముఖ్యమంత్రి, ఆయన మనుషులు ఆ పరిధి దాటి నన్ను నిందిస్తున్నారు. వాళ్ల మాటలు నన్ను తీవ్రంగా కుంగదీస్తున్నాయి. గుండె బద్దలవుతోంది. ఇక భరించలేను. పెద్దాయనే నాకు దిక్కు. ఆయనకే నా బాధ చెప్పుకుంటా. నిజానికి నేతాజీ(ములాయం సింగ్ యాదవ్)తో బాబు(సీఎం అఖిలేశ్ యాదవ్) గురించి ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్‌గానే తప్ప నెగటివ్‌గా మాట్లాడను. ఈ విషయంలో వాళ్ల(అఖిలేశ్ వర్గం) విమర్శలు భరించలేకపోతున్నా’అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్ మీడియాతో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన అమర్ సింగ్.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ములాయం సింగ్ నివాసానికి వెళ్లి గంటలపాటు చర్చలు జరిపారు. సమాజ్‌వాదీ పార్టీలో కొద్ది రోజుల కిందట తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు.. ములాయం జోక్యంతో సద్దుమణిగినట్లయ్యాయి. కానీ వైరిపక్షాలు వీలుచిక్కినప్పుడల్లా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూనేఉన్నారు. అమర్ సింగ్‌కు వ్యతిరేకంగా సీఎం అఖిలేశ్ వర్గీయులు మాటలదాడిని తీవ్రతరం చేశారు. దీంతో అమర్.. నేతాజీని వ్యక్తిగతంగా కీలక చర్చలు జరిపారు. ‘ముఖ్యమంత్రి అఖిలేశ్తోనే నాకు గొడవ. అదే ములాయం కొడుకుగా మాత్రం అఖిలేశ్‌తో ఎలాంటి సమస్యలు లేవు. వాస్తవంగా అతనికి సంబంధంచి మేలుచేసే సలహాలే ఇస్తుంటా. ఎందుకోగానీ వాళ్లకు ఆ విషయం అర్థంకాదు. నేతాజీ నన్ను అర్థం చేసుకున్నారు. అందుకే బహిరంగవేదికలపైనా నన్ను సమర్థిస్తారు. ఏది ఏమైనా నేను ములాయం నమ్మినబంటును. నా బాధ చెప్పుకుంటా. చివరికి ఆయన ఆదేశాలనే శిరసావహిస్తా’అని అమర్‌సింగ్ అన్నారు. -
'ఒట్టు.. పార్టీని నిలువునా చీలుస్తానన్నాడు'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడై తిరిగి పార్టీలోకి వచ్చిన అమర్ సింగ్ కాలిగోటికి కూడా అఖిలేశ్ సరిపోడని పరుష వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని వేళలా పార్టీకోసం కష్టపడ్డానని, తాను ఏం చేసినా నేతాజీ(ములాయం సింగ్)కోసమే చేశానని చెప్పారు. సమాజ్ వాది పార్టీని చీలుస్తానని, కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానని తనతో అఖిలేశ్ స్వయంగా అన్నాడని, ఈ విషయం తాను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నానని అన్నారు. అమర్ సింగ్ తిరిగి అడుగుపెట్టడం, మంత్రి పదవి నుంచి శివపాల్‌ను తొలగించడం వంటి పరిణామాల తర్వాత ఎస్పీ దాదాపు నిట్టనిలువునా చీలిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన శివపాల్.. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోపక్క, తాజాగా ఏర్పడిన వివాదం విషయంలో సోమవారం ములాయంతో శివపాల్, అఖిలేశ్ వేర్వేరుగా భేటీ అయ్యి పలు విషయాలు కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా ములాయం ముందు శివపాల్ భావోద్వేగానికి లోనయ్యారు. 'సమాజ్ వాది పార్టీకి నేను చేసిన సేవలు చిన్నవా?అఖిలేశ్‌ను సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు మద్దతిచ్చాను. కానీ, నన్ను ఎప్పుడైతే అధ్యక్షుడిగా చేశారో అతడు నా వద్ద ఉన్న ఇతర శాఖలు లాక్కున్నాడు. నేను అఖిలేశ్ కన్నా తక్కువ పనిచేశానా? ముఖ్యమంత్రిగా అతడు చెప్పిన ప్రతీది విన్నాను. అలాగే నేతాజీ చెప్పింది చేశాను. నేను అమర్ సింగ్ తో టచ్ లో ఉన్నది నిజమే. అయితే, ఈ విషయం నేను ఎప్పుడూ దాచలేదు' అని చెప్పాడు. అదే సమయంలో తండ్రి ములాయంకు అఖిలేశ్ కూడా గట్టి వివరణ ఇచ్చాడు. పార్టీ చీఫ్ (శివపాల్) ఏం చేశాడో అందుకు ప్రతిఫలమే ఇదంతా. నేను మీవల్లే(ములాయం వల్లే) ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉన్నాను. మీకు వ్యతిరేకంగా కుట్ర చేసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించబోను. పార్టీనిగానీ, ములాయంను గానీ బలహీన పరచాలని కుట్ర చేసేవారిపై నేను వెంటనే చర్యలు తీసుకుంటాను' అని అఖిలేశ్ అన్నారు. కాగా, వీరిద్దరితో కలిసి ములాయం సాయంత్రం మరోసారి భేటీ అవనున్నారు. -
రెండుకళ్ల సిద్ధాంతంతో 'సైకిల్'కి రిపేరు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చుతారంటూ చెలరేగుతున్న ఊహాగానాలకు సమాజ్ వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ సమాధానం ఇచ్చారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. ముఖ్యమంత్రిని మార్చబోమని స్పష్టం చేశారు. సీఎం అఖిలేశ్ యాదవ్, ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ లు కూడా ములాయంతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముగ్గురూ మూడు భిన్నవాదలను వినిపించారు. తొలుత ఆవేశపూరిత ప్రసంగం చేసిన అఖిలేశ్.. 'నాన్నే నాకు గురువు, దైవం' అని, పార్టీని చీల్చాలనే ఆలోచన లేనేలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో శివపాల్, అమర్ సింగ్ ల తీరును ఆక్షేపించారు. 'కేబినెట్ కు సమాంతరంగా అమర్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారా?'అని అఖిలేశ్ ప్రశ్నించారు. పూర్తికాకముందే అఖిలేశ్ నుంచి మైక్ లాగేసుకున్న శివపాల్ యాదవ్.. తన వర్గంపై సీఎం చేస్తోన్న ఆరోపణలకు ఖండించారు. 'ముఖ్యమైన పనిమీద ఇటీవలే సీఎం చాంబర్ కు వెళ్లా. మాటల సందర్భంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సీఎం నాతో అన్నారు. ఇది నినిజం. గంగమ్మమీద ఒట్టు. అఖిలేశ్, బీజేపీ కుమ్మక్కయ్యారు'.. ఇదీ సమాజ్ వాది పార్టీ యూపీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తాజా వాదన. అన్నకొడుకు అఖిలేశ్ బీజేపీ మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని, ఎస్పీని విచ్ఛిన్నం చేసేదిశగా బీజేపీ కూడా అతనికి మద్దతు పలుకుతోందని వ్యాఖ్యానించారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత మైక్ అందుకున్న ములాయం.. మొదట అఖిలేశ్- శివపాల్ లు ఆలింగనం చేసుకోవాలని ఆదేశించారు. ఇద్దరూ తనకు ముఖ్యులేనని అన్నారు. గతంలో చేసిన తప్పులకు అమర్ సింగ్ ను క్షమించేశానని, కష్టకాలం అతను పార్టీకి అండగా నిలిచాడని ములాయం గుర్తుచేశారు.. శివపాల్, అమర్ సింగ్ లను ఒదులుకోలేనని స్పష్టంగా చెప్పారు. అదేసమయంలో అఖిలేశ్ ను సీఎం పదవినుంచి తొలిగించబోనని తేల్చిచెప్పారు. తద్వారా రెండు కళ్ల సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని సైకిల్ పార్టీ చీఫ్ చెప్పకనే చెప్పారు. నవంబర్ 5న నిర్వహించనున్న సమాజ్ వాది పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపైనా ఈ సమావేశంలో చర్చించారు. -
అఖిలేశ్‌కు బీజేపీ మద్దతు..?
న్యూఢిల్లీ: అంతర్గతమే అయినా.. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో రాజకీయ ఆధిపత్యపోరాటానికి వేదికైన సమాజ్ వాది పార్టీ చీలిపోతే లాభపడేది ఎవరు? 'నాన్నే నా గురువూ దైవం..'అని పైకి చెబుతున్నా ఆ నాన్నకు అత్యంత ఆప్తులను కేబినెట్ నుంచి తొలిగించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆ పని ఎందుకు చేశారు? 'ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ములాయం కుటుంబం రాజకీయ డ్రామాలాడుతోంది'అని బీఎస్పీ, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ విమర్శిస్తున్నా.. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? 2017లో సొంతగా అధికారంలోకి రాలేకుంటే 'అఖిలేశ్- బీజేపీ' ప్రభుత్వ ఏర్పాటే ఎజెండాగా సీఎంకు కమలదళం అండగా నిలుస్తోందా? అనే ప్రశ్నలకు విశ్లేషకులు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు. ఈలోపే బీజేపీ సీనియర్ ఎంపీ శతృఘ్న సిన్హా బాహాటంగా అఖిలేశ్ యాదవ్ కు మద్దతు ప్రకటించడం తీవ్రచర్చనీయాంశమైంది. 'సొంతవాళ్లే అఖిలేశ్ ను ప్రమాదకరమైన రాజకీయ రొంపిలోకి లాగారు. అతణ్ని చూస్తే నా హృదయం ద్రవించిపోతోంది. ఆ ఊబిలో నుంచి అఖిలేశ్ విజయవంతంగా బయటపడాలని ప్రార్థిస్తున్నా' అంటూ శతృఘ్న సిన్హా.. యూపీ సీఎంకు బాసలగా నిలిచారు. అంతేకాదు యువనాయుడైన అఖిలేశ్ పాలనలో దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని నమ్ముతున్నట్లు సిన్హా పేర్కొన్నారు. గతంలో(2012లో)నూ ఈ బీజేపీ నేత అఖిలేశ్ ను పొగిడిన సందర్భాలున్నా.. ప్రస్తుత తరుణంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవంబర్ 5న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవాన్ని జరుపుకోనుండగా వేడుకల నిర్వహణపై పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ సోమవారం లక్నోలో కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. సీఎం అఖిలేశ్ తోపాటు బహిష్కృత మంత్రి శివపాల్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఎస్పీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాబాయి- అబ్బాయి వర్గీలు మధ్య తోపులాట చోటుచేసుకుంది. -
సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?
-
సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?
- తండ్రీకొడుకుల మధ్య ముదురుతున్న వివాదం - బాబాయ్ శివ్‌పాల్ సహా ముగ్గురు మంత్రులపై అఖిలేశ్ వేటు - వారంతా అమర్‌సింగ్ వర్గం నేతలే - ప్రతిగా సీఎంకు మద్దతుగా ఉన్న రాంగోపాల్ బహిష్కరణ - ఎస్పీలో ముదురుతున్న వివాదం - ఎఫ్డీసీ నుంచి జయప్రదకూ ఉద్వాసన నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడ్డాయి. శివ్‌పాల్, నారద్ రాయ్, ఓం ప్రకాశ్, సయేదా షాదాబ్ ఫాతిమాలను మంత్రి వర్గం నుంచి అఖిలేష్ తొలగించగా.. సీఎం వర్గానికి చెందిన రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి అధ్యక్షుడు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లూ సీఎం అఖిలేశ్, పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం.. ఇప్పుడు సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం మధ్య వేడి రాజేస్తోంది. లక్నో: నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడ్డాయి. ఇన్నాళ్లూ సీఎం అఖిలేశ్, పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం.. ఇప్పుడు సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం మధ్య వేడి రాజేస్తోంది. ఆదివారం జరిగిన అనూహ్య పరిణామాల్లో.. అఖిలేశ్, ములాయం తమ వ్యతిరేక వర్గాల్లోని ముఖ్యనేతలపై వేటు వేయటంతో పార్టీ ముక్కలు కాక తప్పదనే సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా బయటపడకున్నా రెండుగా చీలిపోయారు. తండ్రీ కొడుకుల వివాదం మళ్లీ సర్దుకునే పరిస్థితులు కనిపించకపోవటంతో.. చీలిక అనివార్యమని రాజకీయ నిపుణులంటున్నారు. ఏం జరిగింది? సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలతో జాతీయాధ్యక్షుడు ములాయం సింగ్ భేటీ ఏర్పాటు చేశారు. భేటీలో పార్టీ అభివృద్ధి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం అందింది. ఇంతలోనే ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలేశ్ హడావుడిగా భేటీ అయ్యారు. ఎన్నికలు, నవంబర్ 3 నుంచి జరగనున్న ‘వికాస్ యాత్ర’పై చర్చించిన అఖిలేశ్.. పార్టీలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమనే ధోరణిలోనే కనిపించారు. సమావేశం నుంచి బయటకు రాగానే.. శివ్‌పాల్, నారద్ రాయ్, ఓం ప్రకాశ్ (కేబినెట్ మంత్రులు), సయేదా షాదాబ్ ఫాతిమా (సహాయ మంత్రి)లను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లు గవర్నర్ రాంనాయక్‌కు సిఫారసు చేశారు. దీన్ని గవర్నర్ వెంటనే ఆమోదించారు. దీంతోపాటు యూపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షురాలిగా జయప్రదను కూడా తొలగించారు. అమర్‌సింగ్ ఛాయలొద్దు: అమర్‌సింగ్ వర్గంలోని వారెవరూ తన ప్రభుత్వంలో ఉండటానికి వీల్లేదని అఖిలేశ్ చెప్పినట్లు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, ఈ ముగ్గురిని తొలగించేందుకు కొద్ది సేపటి ముందు.. అఖిలేశ్ అనుకూల వర్గం నాయకుడైన రాంగోపాల్ యాదవ్ (ములాయం చిన్నాన్న కుమారుడు) పార్టీ కార్యకర్తలకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సీఎంకు సంపూర్ణ మద్దతివ్వాలి. ఆయనకు వ్యతిరేకంగా వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో ముఖం చూపించే అవకాశం ఉండదు’ అని ఇందులో పేర్కొన్నారు. అయితే పార్టీని వీడే ఆలోచన లేదని.. నేతాజీ (ములాయం)కు వెన్నుదన్నుగా ఉంటానని.. ఎమ్మెల్యేల సమావేశంలో అఖిలేశ్ అన్నట్లు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. నవంబర్ 3న వికాస్ యాత్ర మొదలైనా.. ఐదున జరిగే పార్టీ రజతోత్సవాల్లో సీఎం పాల్గొంటారన్నారు. ములాయంను కలసిన శివ్‌పాల్ తనను మంత్రివర్గం నుంచి తొలగించటంతో ఎస్పీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్.. ములాయంను కలిశారు. తర్వాత బయటకు వచ్చిన శివ్‌పాల్.. ‘రాంగోపాల్‌ను పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తప్పించటంతోపాటు పార్టీ నుంచి ఆరేళ్లపాటు ములాయం బహిష్కరించారు. నన్ను మంత్రిపదవి నుంచి తప్పించినందుకు బాధపడ్డం లేదు. వచ్చే ఎన్నికల్లో ములాయం నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది’ అని ప్రకటించారు. బీజేపీతో కుమ్మక్కైన రాంగోపాల్.. తనపై, కుమారుడిపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు మూడుసార్లు ఓ బీజేపీ నేతను కలిశారని ఆరోపించారు. ఈ పరిణామాలతో ఎస్పీ నిట్టనిలువుగా చీలిపోయింది. తాజా పరిణామాలపై సోమవారం ప్రజాముఖంగా స్పందిస్తానని ములాయం తెలిపారు. కాచుక్కూచున్న విపక్షాలు యూపీ అన్ని పార్టీలకూ కీలకం. 2019లో కేంద్రంలో క్రియాశీలంగా ఉండాలనుకునే పార్టీలకు ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో పాగా వేయటంఅవసరం. మరీ ముఖ్యంగా బీజేపీకి. ఎస్పీ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేత రీటా బహుగుణను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. తాజా పరిణామాలతో అఖిలేశ్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎస్పీ వివాదంతో మెజారిటీ సాధించేలా బీజేపీ పావులు కదుపుతోంది. బీఎస్పీ కూడా ఈ పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తోంది. ఎస్పీలో చీలిక ప్రధాన ప్రతిపక్షమైన తమకే అనుకూలిస్తోందని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా తాజా మార్పులపై విశ్లేషణ చేసుకుంటోంది. రాహుల్ పర్యటనలకు తోడు ప్రియాంకను వీలైనంత త్వరగా రంగంలోకి దించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటోంది. -
బాబాయ్‌పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు
-
బాబాయ్‌పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో, ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం వేగంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని సంక్షోభంలో పడేశాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ సహా నలుగురు మంత్రులపై వేటువేయగా.. అఖిలేష్‌కు మద్దతుగా ఉన్న సమీప బంధువు, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి ములాయం బహిష్కరించారు. రాంగోపాల్‌ను పార్టీ పదవి నుంచి తొలగించడంతో పాటు ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ ప్రకటించారు. ములాయంకు శివపాల్ సొంత తమ్ముడు కాగా, రాంగోపాల్ వరుసకు సోదరుడు అవుతారు. అఖిలేష్‌ను రాంగోపాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని శివపాల్ అన్నారు. రాంగోపాల్ తనపై కుట్రపన్నారని, ఆయన కొడుకును రక్షించుకోవడానికి బీజేపీతో చేతులు కలిపాడని ఆరోపించారు. అంతకుముందు అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్ ఎస్పీ చీఫ్ ములాయంకు లేఖ రాశారు. -
మా కుటుంబం విచ్ఛిన్నానికి అమర్ సింగ్ కుట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదురుతోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఎస్పీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని ఆరోపించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన కుట్రపన్నారని అఖిలేష్ అన్నారు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విబేధాలు ఆదివారం తారస్థాయికి చేరుకున్నాయి. బాబాయ్ శివపాల్ సహా నలుగురు మంత్రులపై ఈ రోజు అఖిలేష్ వేటు వేశారు. అమర్ సింగ్‌కు సన్నిహితురాలైన సినీ నటి జయప్రదను ఎఫ్డీసీ పదవి నుంచి తొలగించారు. అనంతరం అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం ఆవేశంగా మాట్లాడిన అఖిలేష్.. అమర్ సింగ్ మద్దతుదారులు తమ మద్దతు దారులు కారని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శివపాల్ తన సోదరుడు ములాయం ఇంటికి వెళ్లారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు ములాయం అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
ఇలా జరుగుతుందని ముందే తెలుసు: ఆజంఖాన్
లక్నో: నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీలో భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ అనుంగుడు, అఖిలేష్ మంత్రివర్గంలో సీనియర్ అయిన ఆజం ఖాన్.. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తాను ముందే ఊహించానన్నారు. ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆజం ఖాన్.. 'కొన్ని దుష్టశక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటి పరిణామాలు తప్పవు. వాళ్లు మళ్లీ పార్టీలోకి అడుగు పెట్టినప్పుడే ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించా'అని పరోక్షంగా అమర్ సింగ్ విమర్శించారు. కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవర్ని తొలగించాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆమేరకు అఖిలేష్ వ్యవహరించారని ఆజం ఖాన్ అన్నారు.(సీఎం సంచలన నిర్ణయం:యూపీలో రాజకీయ కలకలం) అమర్ సింగ్ పునరాగమనంతో సమాజ్ వాదీ పార్టీలో మొదలైన అంతర్గతపోరులో ములాయం సింగ్ యాదవ్ ప్రియ సహోదరుడు శివపాల్ యాదవ్ ఒకవైపు ఉండిపోగా, సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరోవైపునకు చేరారు. రెండు వర్గాలకు మధ్య సమన్వయం చేసేందుకు నేతాజీ ములాయం చేసిన ప్రయత్నాలన్ని బెడిసికొట్టడం చివరికి మంత్రుల ఉద్వాసనకు దారితీసింది. -
సీఎం అఖిలేష్ సంచలన నిర్ణయం
-
అఖిలేష్ సంచలన నిర్ణయం
లక్నో: ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయాలతో ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సమాజ్ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరుసకు బాబాయి అయిన శివపాల్ యాదవ్ ను అఖిలేష్ కేబినెట్ నుంచి తొలిగించారు. శివపాల్ తోపాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు పడింది. అమర్ సింగ్ అనుకూలురుగా ముద్రపడ్డ మరో నగులురు మంత్రులు, ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్నవారిపైనా వేటు తప్పదని అఖిలేష్ వర్గం ఆదివారం ప్రకటించింది. ఆదివారం నాటి పరిణామాలతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది. వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల నడుమ.. సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులతో ఆదివారం సీఎం అఖిలేష్ యాదవ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. సమావేశం ఆద్యంతం ఆవేశపూరితంగా మాట్లాడిన అఖిలేష్.. తనకు వ్యతిరేకంగా లేదా అమర్ సింగ్ కు అనుకూలంగా వ్యవహరించే ఏఒక్కరినీ విడిచిపెట్టబోనని హెచ్చరించినట్లు మోయిన్ పురి ఎమ్మెల్యే రాజు యాదవ్ మీడియాకు చెప్పారు. ములాయం సింగ్ కు ప్రియమైన తమ్ముడిగా, కేబినెట్ లో షాడో సీఎంగా కొనసాగుతున్న శివపాల్ యాదవ్ తోపాటు మంత్రులు షబాబ్ ఫాతిమా, ఓం ప్రకాశ్, నారద్ రాయ్ లు ఉద్వాసనకు గురైనవారిలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి అమర్ సింగ్, శివపాల్ లకు వీరవిధేయిలే కావడం గమనార్హం. సీఎం అఖిలేష్ సంచలన నిర్ణయంతో శివపాల్ వర్గం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పార్టీ సుప్రిమో ములాయంను సంప్రదించకుండా అఖిలేష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయిన శివపాల్.. పరుగున అన్ని ఇంటికి బయలుదేరారు. మంత్రులను తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయంపై ములాయం స్పందన వెలువడాల్సిఉంది. -
'సీఎంకు చేతబడి చేయించింది!'
లక్నో: రోజుకో మలుపు తిరుగుతున్న యాదవ్ పరి'వార్'లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. 'సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది' అని అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ ములాయం కు రాసిన లేఖలో ఉదయ్ వీర్ సంచలన ఆరోపణలు చేశారు. శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు ఎలా బహిర్గతమైందో తెలియదని ఉదయ్ వీర్ అంటున్నారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. 'ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ'ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు. ఎవరీ సాధన యాదవ్? సాధనా గుప్తా యాదవ్.. సమాజ్ వాదీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య. 2007లో ములాయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటి నుంచి యాదవ్ పరివారంలో సాధన 'ఫస్ట్ లేడీ'గా కొనసాగుతున్నారు. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో ఒక శుభ దినాన పెళ్లాడారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ ఇరువురికీ (1988లో)జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. -
కొత్తగా 10 మంది మంత్రుల ప్రమాణం
న్యూఢిల్లీ: ఇటీవల ఉద్వాసనకు గురైన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతికి మళ్లీ మంత్రి పదవి దక్కింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్.. 10 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ఏడుగురికి కేబినెట్ హోదా, ముగ్గురికి సహాయ మంత్రి పదవి హోదా దక్కింది. 2012 మార్చి నుంచి అఖిలేష్ మంత్రివర్గాన్ని విస్తరించడమిది ఎనిమిదోసారి. ఈ రోజు మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో ప్రజాపతి, మనోజ్ పాండే, శివకాంత్ ఓఝా, అభిషేక్ మిశ్రా, రియాజ్ అహ్మద్, జియావుద్దీన్ రిజ్వీ, రవిదాస్ మెహ్రోత్రా, నరేంద్ర వర్మ, యాసీర్ షా, షాంఖ్లాల్ మాఝి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం అఖిలేష్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు యూపీ పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్, మంత్రులు పాల్గొన్నారు. ప్రజాపతిపై అవినీతి ఆరోపణలు రావడంతో అఖిలేష్ ఇటీవల ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అఖిలేష్‌కు, బాబాయ్, సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్‌కు విబేధాలు ఏర్పడ్డాయి. ములయాం సింగ్ యాదవ్ జోక్యంతో ఈ వివాదం ముగిసింది. అలాగే ప్రజాపతిని మళ్లీ కేబినెట్లోకి తీసుకునేందుకు అఖిలేష్ అంగీకరించారు. -
వాళ్లు మళ్లీ కలిసి షాకివ్వనున్నారా!
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎలాంటి పొత్తు లేకుండానే గత ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సమాజ్ వాది పార్టీ మరోసారి అదే విజయాన్ని దక్కించుకునేందుకు పొత్తులకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీతో.. ఈ ఊహగానాలకు బలాన్నిచ్చేట్లుగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. రాహుల్ మంచి వాడని, అవసరం అయితే, తాము స్నేహాన్ని ఒకరికొకరం పంచుకుంటామని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే 2,500 కిలోమీటర్లు యాత్రను రాహుల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన అఖిలేశ్ 'రాహుల్ మంచి మనిషి.. మంచి బాలుడు. అతడు ఎక్కువకాలంపాటు యూపీలోనే గడిపితే మాకు అతడితో స్నేహం కూడా ఉంటుంది. ఇద్దరు మంచి వ్యక్తులు మరోసారి కలుసుకుంటే అందులో తప్పేముంది' అంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించి అవాక్కయ్యేలా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, సమాజ్ వాది పార్టీకి గతంలో మంచి సంబంధాలే ఉన్నాయి. కేంద్రంలో కూడా ములాయం పలుమార్లు కాంగ్రెస్ కు అండగా నిలిచారు. కాగా, అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కాంగ్రెస్‌తో ఎస్పీ పొత్తుపెట్టుకుంటుందా అని మీడియా ప్రశ్నించగా ప్రతి విషయాన్ని అలా రాజకీయ కోణంలోనే ఎందుకు చూస్తారు అని సమాధానం దాట వేశారు. -
'సీఎంగారు రక్షించండి.. వేధిస్తున్నారు'
ఆగ్రా: నజియా అనే ఆ అమ్మాయి గొప్ప సాహసికురాలుగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది కిడ్నాపర్ల చెర నుంచి ఓ ఆరేళ్ల బాబును రక్షించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతుల మీదుగా ఆగస్టులో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి అవార్డును అందుకుంది. కానీ, అలాంటి బాలిక ఇప్పుడు మాత్రం అదే ముఖ్యమంత్రికి 'తనను రక్షించండి' అంటూ వరుసగా ట్వీట్లు చేసింది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల ఆకృత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆమె సీఎం అఖిలేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా గ్యాంబ్లింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదుచేసినప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు, గ్యాంబ్లర్స్ కలిసి తనను వేధిస్తున్నారని, తనకు అపఖ్యాతి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని సీఎంకు ట్వీట్ ద్వారా తెలిపింది. తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని సీఎంను వేడుకుంది. అలాగే, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారని, అతడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడంతో అతడి వల్ల తమ కుటుంబానికి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 'ఇలాగే తన పోరాటం కొనసాగించమని ముఖ్యమంత్రి నా భుజం తట్టి చెప్పారు. ఎప్పుడు నా గొంతు విప్పినా నా జీవితాన్ని ఓ సమస్యల సుడిగుండంలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఫిర్యాదు చేసినవారిని కాకుండా పోలీసులు నన్ను పిలిచి విచారిస్తున్నారు. నేను జూలైలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు' అని ఆ బాలిక నేరుగా సీఎం అఖిలేశ్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేసింది. -
సీఎంకు రక్తంతో ఉత్తరం రాసిన అమ్మాయి
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు రక్తంతో ఉత్తరం రాసింది. తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని అఖిలేష్‌ను కోరింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని విన్నవించింది. బులంద్షార్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. మగసంతానానికి జన్మనివ్వలేదనే కారణంతో తమ కళ్లెదుటే తన తల్లిని సజీవదహనం చేశారని పెద్ద కుమార్తె లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. 'బేటీ బచావో, బేటీ పదావో (బాలికను రక్షించండి, విద్యావంతురాలిని చేయండి) అని మీరు చెబుతారు. అయితే మీ ప్రాంతంలో ఓ మహిళ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో ఆమెకు నిప్పుపెట్టిచంపారు. మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు మాకు ఎలాంటి సాయం చేయకపోగా, నిందితులను రక్షిస్తున్నారు. మానాన్న మనోజ్ బన్సాల్, ఇతర కుటుంబ సభ్యులు మా అమ్మను చంపారు. నన్ను, నా చెల్లిని గదిలో బంధించి మా అమ్మకు నిప్పంటించారు' అని సీఎంకు రాసిన లేఖలో ఆ అమ్మాయి పేర్కొంది. కాగా ఈ అమ్మాయి ఇంతకుముందు జూలైలో ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన రాలేదు. దీంతో రక్తంతో రాస్తే తన పరిస్థితిని ముఖ్యమంత్రి అర్థం చేసుకుని న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మరోసారి లేఖ పంపినట్టు చెప్పింది. మొదట ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ ఉత్తరాన్ని తర్వాత ఫ్యాక్స్ ద్వారా సీఎంకు పంపింది. మహిళను చంపిన మరుసటి రోజే పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినా వారిని అరెస్ట్ చేయలేదని బాధిత మహిళ కుమార్తె ఆరోపించింది. పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఆధారాలు లభిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని బులంద్షార్ సీనియర్ ఎస్పీ అనీస్ అన్సారీ చెప్పారు. -
'సీఎం మమ్మల్ని కలవాల్సిందే'
లక్నో: తమను ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కలవాల్సిందేనని బులంద్ షహర్ లో లైంగిక దాడికి గురైన బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆయన కలిస్తేనే తమ కేసు విచారణ సత్వరంగా పూర్తవుతుందని అన్నారు. తామేం రాజకీయాలు చేయడం లేదని, కేవలం న్యాయం కోసమే పోరాడుతున్నామని చెప్పారు. గతవారం బులంద్ షహర్ లో ఓ తల్లి కూతుళ్లపై కొందరు దుండగులు సామూహిక లైంగిక దాడి చేయగా ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఆ కుటుంబానికి మూడు లక్షల నష్ట పరిహారం, ఘజియాబాద్ లో రెండు ప్లాట్లు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆ కుటుంబం తమను సీఎం అఖిలేశ్ కలవాల్సిందేనని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం అఖిలేశ్ ఒప్పుకున్నారని తాము పత్రికల్లో చదివామని, దాంతోపాటు తాము రాజకీయాలకు పాల్పడుతున్నట్లు మరికొన్నిట్లో చదివామని, అయితే, తామేం రాజకీయాలు చేయడంలేదని, న్యాయం కోసం ప్రాధేయపడుతున్నామని వాపోయారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి ఏడురోజులు గడుస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆయనను వదిలేసి నా వెంట పడతారేం?: హేమ
మథుర: 'శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోకి వస్తుంది. ఎంపీగా నేను ఆ విషయాల్లో జోక్యం చేసుకోలేను. అల్లరి మూకలను నియంత్రించడంలో విఫలమైన అఖిలేశ్ యాదవ్ ను వదిలి, ప్రతి ఒక్కరూ నా వెంటపడటం హాస్యాస్పదం. మథురలో 10 రోజులు ఉండి, నేను వెళ్లిపోయిన మరునాడే హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఇతర పనులన్నింటిని పక్కకుపెట్టి ఇక్కడికి బయలుదేరా. నిజానికి జవహర్ బాగ్ లోని 260 ఎకరాల పార్కు స్థలంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు నేను పదేపదే విన్నవించాను. కానీ సమస్య పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం చొరవచూపలేదు. పైగా ఆక్రమణదారులకు వత్తాసుపలికారు. వాళ్లు(ఆక్రమణదారులు) అంతంత భారీ ఆయుధాలు సమకూర్చునేంతవరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎంపీగా మథురలో జరుగుతున్న విషయాలపై నాకు అవగాహన ఉంది. ఆక్రమణదారుల పీచమణిచేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నా, అఖిలేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతి ఇవ్వడంలేదు' అంటూ తన నియోజకవర్గంలో చోటుచేసుకున్న అల్లర్లపై స్పందించారు మథుర ఎంపీ, సినీనటి హేమా మాలిని. (చదవండి: రగులుతున్న మథుర) పోలీసులు, ఆక్రమణదారుల మధ్య కాల్పులతో గడిచిన రెండు రోజులుగా మరుభూమిని తలపిస్తోన్న మథురలో ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. హింసాయుత సంఘటనలపై అధికార, విపక్షాలు, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అల్లర్లు అట్టుడుకుతున్నవేళ.. సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హేమా మాలిని శుక్రవారం రాత్రి మథురకు చేరుకున్నారు. ఆక్రమణదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎస్పీ ముకుల్ ద్వివేది కుటుంబసభ్యులను శనివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోపాటు మీడియాపైనా మండిపడ్డారు. ఆక్రమణదారులను అదుపుచేయడంలో విఫలమైన అఖిలేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం బీజేపీ తలపెట్టిన ర్యాలీకి హేమ మాలిని నేతృత్వం వహిస్తారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జవహర్ బాగ్ లోని పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ సంస్థకు చెందిన కార్యకర్తలు దాడి చేయడం, పోలీసులు ప్రతిదాడి చేసిన సంఘటనలో ఎస్పీ, ఎస్ హెచ్ వో సహా 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
అఖిలేశ్ ఉత్తమ సీఎం: ములాయం
మెయిన్‌పురి: దేశంలోకెల్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తనయుడు అఖిలేశ్ ఉత్తమ ముఖ్యమంత్రి అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కొనియాడారు. 2017 శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్‌ను ములాయం ప్రకటించారు. కచ్చితంగా అఖిలేశ్ దేశంలోనే ఉత్తమ సీఎం అని ప్రశంసించిన ఆయన రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి పేదలు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాడని పేర్కొన్నారు. -
కేంద్రం, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి
-
కేంద్రం, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి
సుస్థిర ప్రభుత్వం ఉంటేనే ప్రగతి ♦ హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధాని ♦ కంపెనీల కార్పొరేటీకరణ ఆలోచన ఉందని వ్యాఖ్య ♦ మొత్తానికి పార్లమెంటు సాగుతోందన్న మోదీ న్యూఢిల్లీ: దేశాభివృద్ధికోసం తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలసి వస్తేనే దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. దేశాన్ని ప్రగతిబాటలో తీసుకెళ్లడం కేంద్రప్రభుత్వం ఒకరివల్లే సాధ్యపడదన్నారు. శుక్రవారం హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. రాష్ట్రాల అభివృద్ధికోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. చతురోక్తులతో 35 నిమిషాలపాటు ప్రసంగించిన మోదీ.. ‘పార్లమెంటుకు వెళ్లాల్సిన సమయం అయింది. వర్షాకాల సమావేశాల్లో వివిధ కారణాల వల్ల సభ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కానీ ఈసారి మొత్తానికి సభ జరుగుతోంది. అన్ని రాజకీయపార్టీల చొరవ కారణంగానే పార్లమెంటు సజావుగా కొనసాగుతోంది’ అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంవల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. దేశంలో కొత్త ఆలోచనలకు కొదవ లేదని, అయితే వాటిని సమర్థంగా అమలు పరచడమే కీలకమని, తాను ఈ అంశంపైనే దృష్టిసారించానని చెప్పారు. వంద పట్టణాల్లో ఎల్ఈడీ లైట్ల వినియోగం, వివిధ వర్గాలకు ఇస్తున్న సిబ్సిడీలు, పబ్లిక్‌రంగ సంస్థల్లో పనివిధానంలో మార్పు తదితర అంశాలను ఆయన వివరించారు. తన పిలుపుతో దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల కుటుంబాలు ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నాయని, వీటిని తమ ప్రభుత్వం పేదవర్గాలకు ఇస్తుందని చెప్పారు. రైతులకోసం ఇస్తున్న సబ్సిడీ యూరియా పక్కదారి పడుతోందని, అయితే దానిని గుర్తించి అడ్డుకట్ట వేశామని తెలిపారు. భారత్ ఉజ్వల భవిష్యత్తువైపు వెళుతోందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని సబ్సిడీలు తొలగిస్తున్నాడని చాలామంది విమర్శిస్తుండొచ్చు.. కానీ లీకేజీలను అరికట్టి ప్రభుత్వ ధనాన్ని పొదుపుచేయకపోతే సంస్కరణలు చేపట్టడం కష్టమన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలో నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం లేదా మూసేయటం ఒకటే ఇన్నాళ్లుగా జరిగేదని.. కానీ అలాంటి సంస్థలను కార్పొరేటీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి 85 పెద్ద ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని.. కానీ ప్రస్తుతం 60-65 ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు. కాగా, ఢిల్లీలోని నేవీ హౌజ్‌లో జరిగిన నేవీ డే వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేవీలో సేవలందించిన వారికి ‘ఇన్నోవేషన్ ట్రోఫీ’లను మోదీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ములాయం పీఎం, డిప్యూటీగా రాహుల్: అఖిలేశ్ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే ములాయం సింగ్ ప్రధానిగా, రాహుల్‌గాంధీ ఉపప్రధానిగా ఉంటే బాగుంటుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో.. రాహుల్‌తో ఉన్న వ్యక్తిగత స్నేహంతో కాంగ్రెస్‌తో కలిసే అవకాశం ఉందా అని సభికులు ఆయన్ను అడిగారు. ‘నేను సమాజ్‌వాదీ (సోషలిస్టు)ని కాబట్టే నన్ను ఈ ప్రశ్న వేస్తున్నారా? నేతాజీ కలలను సాకారం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మా పొత్తుకు అంగీకారం కుదిరితే.. మా నాన్న ప్రధాని అవుతారు. ఆయన(రాహుల్ వైపు చేయి చూపిస్తూ) ఉపప్రధాని అవుతారు’ అని అన్నారు. అప్పుడు రాహుల్ ఇబ్బందికరంగా నవ్వుతూ కనిపించారు. అఖిలేశ్ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. -
అఖిలేశ్ సంచలన నిర్ణయం
-
'మోదీ.. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయండి'
లక్నో: ఫేస్ బుక్, ట్విట్టర్వంటి సామాజిక అనుసంధాన వేధికల్లో అందరికంటే ముందుండే ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. ఫేస్ బుక్‌లో తక్కువ మాట్లాడాలని, క్షేత్ర స్థాయిలో ఎక్కువగా పనిచేయాలని సూచించారు. బీజేపీ పార్టీ నాయకులను నియంత్రణలో పెట్టాలని, వారిని ఇతర కార్యకలాపాలపై దృష్టిపెట్టకుండా దేశ అభివృద్ధికి పాటుపడేలా చూడాలని కూడా చెప్పారు. గురువారం ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధాని మోదీ మీకు ఎదురెదురుగా వస్తే ఏం చెప్తారు అని సదరు టీవీ చానెల్ అఖిలేశ్‌ను ప్రశ్నించగా 'ఫేస్ బుక్‌లో తక్కువ మాట్లాడండి.. పనిని ఆచరణలో చేసి చూపెట్టండి' అని చెప్తానని బదులిచ్చారు. దాద్రి ఘటనపై ప్రశ్నించగా.. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరందరికీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారు భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. 'వ్యక్తిగతంగా నేను బీఫ్ తినడానికి వ్యతిరేకుడిని. కానీ ప్రపంచ వ్యాప్తంగా దానిని తింటున్నారు... వాళ్లేమైనా మొత్తం బీఫ్ ఇండస్ట్రీని మూసివేయాలనుకుంటున్నారా? ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. ఓ వ్యక్తి తన ఇంట్లో ఏదో ఒకటి తింటున్నాడు. మొన్న జరిగిన ఘటనతో అంతటా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రజలంతా మేం బీఫ్ తింటున్నాం వచ్చి చంపేయండి అంటున్నారు.. ఇది భారతీయ సంస్కృతా? ప్రపంచం ఏం చెబుతోంది' అంటూ అఖిలేశ్ బీఫ్ వివాదంపై స్పందించారు. దాద్రి ఘటన అనంతరం ప్రపంచ మీడియా ఏం కథనాలు రాసిందో ఓసారి చదివితే ప్రధాని మోదీ, బీజేపీ చాలా సిగ్గుపడాల్సిందేనిని కూడా అఖిలేశ్ వ్యాఖ్యానించారు. -
ఇఖ్లాక్ హత్యపై కప్పదాటు
యూపీ సర్కారు నివేదికలో ప్రస్తావన లేని ‘బీఫ్’ దాద్రి(యూపీ): ఇఖ్లాక్ హత్యోదంతంపై ఉత్తరప్రదేశ్ హోంశాఖ కేంద్రానికి మంగళవారం నివేదికను పంపించింది. ఈ నివేదికలో ఎక్కడా ‘బీఫ్’ ప్రస్తావన స్పష్టంగా లేదు. కేంద్ర హోం శాఖకు పంపిన ఈ నివేదికలో హత్యోదంతాన్ని వివరిస్తూ ‘ఇఖ్లాక్, అతని కుమారుడిపై గుర్తు తెలియని కొంతమంది సెప్టెంబర్ 28రాత్రి వధించరాదని నిషేధం ఉన్న పశువును చంపి ఆ మాంసం తిన్నారన్న ధ్రువీకరణ కాని ఆరోపణలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇఖ్లాక్ మరణించారు. దీనిపై దాద్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణ కొనసాగుతోంద’ ని పేర్కొన్నారు. నివేదికలో హత్యకు అవకాశాలున్నాయని భావిస్తున్న కారణాలు చెప్పలేదు. వ్యక్తి అనుమానాస్పద మృతి: కాగా దాద్రి తాలూకాలో మంగళవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇఖ్లాక్ను హత్య చేసిన బిషాదాలో 24ఏళ్ల జయప్రకాశ్ అనే యువకుడి మృతదేహం అతని ఇంట్లోనే లభించింది. ఇఖ్లా క్ కేసులో నిందితుల జాబితాలో పేరు లేకున్నా, తన కొడుకును పోలీసులు వేధించ టం వల్లే తల్లి ఓంవతి ఆరోపించింది. కాగా, తనను తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందు కు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు బిషాదాలో గ్రామస్థులతో మాట్లాడి న కేంద్రమంత్రి మహేశ్ శర్మపై యూపీ సర్కా రు కేసు నమోదు చేసింది. -
ఇఖ్లాక్ హత్యపై రాజకీయాలు
♦ పార్టీల పరస్పర ఆరోపణలు ♦ కుటుంబానికి సీఎం పరామర్శ దాద్రి/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ తహశీల్ బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నారన్న అనుమానంపై ఇఖ్లాక్ అనే వ్యక్తిని స్థానికులు కొట్టిచంపడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. పార్టీల నేతలు ఈ గ్రామానికొచ్చి పరస్పర విమర్శలకు దిగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదివారం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. ఇఖ్లాక్ కుటుంబాన్ని లక్నోలో పరామర్శించారు. ఈ కుటుంబానికి పరిహారాన్ని రూ.45 లక్షలకు పెంచారు. వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. దాద్రీలో పర్యటించిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్.. గోహత్యకు పాల్పడినవారిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాపాడుతోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సీఎం మతంరంగు పులుముతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీని బిషాదాలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆయనతో కుమ్మక్కయిందా? అని నిలదీశారు. ఇఖ్లాక్ హత్యకేసులో పోలీసులు ఆదివారం ఒక హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క... ఇఖ్లాక్ హత్య దురదృష్టకమరని, దీనికి మతం రంగు పులమొద్దని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. -
లక్నో పోలీసుల చేతికి ‘పెప్పర్-డ్రోన్’!
లక్నో: అల్లరిమూకలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైతే వారిపై పెప్పర్ స్ప్రేను చల్లేందుకు ఉపయోగపడే పెప్పర్-డ్రోన్ (మానవ రహిత విమానం)ను లక్నో పోలీసులు సమకూర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం దీన్ని ఆవిష్కరించారు. ప్రజా సీసీటీవీ ప్రాజెక్టు, నగరంపై నిఘా ప్రాజెక్టు డ్రోన్లను యాదవ్ ప్రారంభించారు.