
ఇఖ్లాక్ హత్యపై కప్పదాటు
యూపీ సర్కారు నివేదికలో ప్రస్తావన లేని ‘బీఫ్’
దాద్రి(యూపీ): ఇఖ్లాక్ హత్యోదంతంపై ఉత్తరప్రదేశ్ హోంశాఖ కేంద్రానికి మంగళవారం నివేదికను పంపించింది. ఈ నివేదికలో ఎక్కడా ‘బీఫ్’ ప్రస్తావన స్పష్టంగా లేదు. కేంద్ర హోం శాఖకు పంపిన ఈ నివేదికలో హత్యోదంతాన్ని వివరిస్తూ ‘ఇఖ్లాక్, అతని కుమారుడిపై గుర్తు తెలియని కొంతమంది సెప్టెంబర్ 28రాత్రి వధించరాదని నిషేధం ఉన్న పశువును చంపి ఆ మాంసం తిన్నారన్న ధ్రువీకరణ కాని ఆరోపణలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇఖ్లాక్ మరణించారు. దీనిపై దాద్రి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విచారణ కొనసాగుతోంద’ ని పేర్కొన్నారు. నివేదికలో హత్యకు అవకాశాలున్నాయని భావిస్తున్న కారణాలు చెప్పలేదు.
వ్యక్తి అనుమానాస్పద మృతి: కాగా దాద్రి తాలూకాలో మంగళవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇఖ్లాక్‌ను హత్య చేసిన బిషాదాలో 24ఏళ్ల జయప్రకాశ్ అనే యువకుడి మృతదేహం అతని ఇంట్లోనే లభించింది. ఇఖ్లా క్ కేసులో నిందితుల జాబితాలో పేరు లేకున్నా, తన కొడుకును పోలీసులు వేధించ టం వల్లే తల్లి ఓంవతి ఆరోపించింది. కాగా, తనను తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందు కు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు బిషాదాలో గ్రామస్థులతో మాట్లాడి న కేంద్రమంత్రి మహేశ్ శర్మపై యూపీ సర్కా రు కేసు నమోదు చేసింది.