ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌లు బీజేపీ, బీఎస్పీలపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రచారంలో రాహుల్, అఖిలేశ్
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌లు బీజేపీ, బీఎస్పీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. మీరట్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ఉత్తరప్రదేశ్ శాంతి, సామరస్యంతో ఉండే రాష్ట్రం అనీ, ఇక్కడి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తే సహించబోమని అన్నారు.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల పొత్తు కుదిరిన రోజే ఓ తుపాను రాష్ట్రంలో మొదలైందనీ, దాని ధాటికి ప్రధాని మోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. అఖిలేశ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఏదైనా తుపాను ఉందంటే అది సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ల విజయానికి దోహదపడేదేనని పేర్కొన్నారు. తుపానులోనూ సైకిల్‌ను ఎలా తొక్కాలో తమ పార్టీ శ్రేణులకు తెలుసునన్నారు.