అన్ని పార్టీల్లోనూ ఎన్నికల కళ | all parties happy on election announcement | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీల్లోనూ ఎన్నికల కళ

Published Sun, Sep 14 2014 10:19 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

all parties happy on election announcement

పింప్రి, న్యూస్‌లైన్ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. ఎన్నికల తేదీలు కూడా ఖారారు కావడంతో అన్ని రాజకీయ పార్టీల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలువరించడానికి ఉత్సాహపడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఆయాపార్టీలు హోరెత్తుతున్నాయి. ప్రచారాలు, అభ్యర్థుల బలప్రదర్శనలూ ఊపందుకొన్నాయి. అభ్యర్థుల నియమాకం ఖరారు కాకముందే ఎన్నికల వేడి రాజుకొంది.

  ఇంకా పార్టీల మధ్య పొత్తులు కొలిక్కిరానే లేదు. పొత్తులు ఫలించి, ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయితే అసలైన ఎన్నికల సందడి తెరమీదికి వస్తుంది. ఒక వేళ పొత్తులు వికటించినా ఎవరిదారిని వారే వెళ్లేందుకు కూడా బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకొంటున్నారు.

 పది నియోజక వర్గాల్లో ఆశావహులు
 పుణే జిల్లాలో పది నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారనుంది. పుణే, పింప్రి-చించ్‌వడ్ నగరాలకు చెం దినవి కావు. పూర్తిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓట ర్లు ఉంటారు. ఇందులో రైతులు అత్యధికంగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తే వారికే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ విశ్షేషకులు బావిస్తున్నారు.

 మావల్...
 మావల్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బాలాబేడగే కొనసాగుతున్నారు. ఈ సారి బీజేపీ నుంచి తిరిగి బాలా బేగడే రంగంలోకి దిగడానికి నిర్ణయించుకొన్నారు. కానీ ఇక్కడ నుంచి జ్ఞానేశ్వర్ దల్వీ, చంద్రశేఖర్ బోస్లే దిగంబర్ బేగడే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. శివసేన నుంచి మచ్చీంద్ర ఖరాడే, రణశింగ్ ఫ్రంకణ్యస్ పోటీ పడుతున్నారు. ఎన్సీపీ నుంచి మావులీ దాబాడే, బాలాసాహెబ్  నేవాలేతోపాటు మరో 15 మంది ఈసీటు కోసం ఆశపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కిరణ్ గైక్వాడ్ పోటీకి సిద్ధమవుతున్నారు.

 శిరూర్-హవేలి...
 శిరూర్ -హవేలినియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీకి చెందిన అశోక్ పవార్ కొనసాగుతున్నారు. ఈ సారి కూడా తనకే సీటు కేటాంచాలని ఆశోక్ ఆశిస్తుండగా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రదీప్ కదం, మంగళాదాస్ టికెట్ వేటలో ఉన్నారు. బీజేపీ నుంచి బాబూరావు పాచర్ణే ముందున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి సందీప్ బోండ్వే పేరు వినిపిస్తోంది.

 జున్నర్...
 జున్నర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీకి చెందిన వల్లభ్ దత్తాత్రేయ కొనసాగుతున్నారు. ఈసారి సీటు కోసం అతుల్ బేనకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పొత్తు వికటిస్తే కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాలాసాహెబ్ దాంగట్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెన్నెస్ నుంచి శరద్ సోన్వాణే, మకరంద్ పాటిల్ ఉండగా మహాకూటమి ఏర్పడక పోతే బీజేపీ నుంచి అడ్వకేట్ దత్తా బాగవతే, శివసేన నుంచి ఆశాతాయి బుచకే, పంచాయతి సమితి మాజీసభ్యులు నేతాజీ వోకే, సంభాజీ తాంబే, జిల్లా పరిషత్ సభ్యులు మావురీ ఇక్కడ నుంచి పోటీకి సిద్ధ మవుతున్నారు.

 దౌండ్...
 దౌండ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీకి చెందిన రమేష్ తోరట్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎన్సీపీ తరఫున రమేష్ తోరట్, తాలూకా పార్టీ అధ్యక్షులు  అప్పా సాహెబ్ పవార్ పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నారు, కాంగ్రెస్ నుంచి తాలూకా అధ్యక్షులు  పోపట్ భాయి టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి రాజా భావు తాంబే పేరు ముందున్నది. బీజేపీ నుంచి నాందేవ్, వాస్‌దేవ్ కాలే, రాహుల్ కూల్ టికెట్‌ను ఆశిస్తున్నారు.

 ఇందాపూర్...
 ఇందాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా హర్షవర్ధన్ పాటిల్ (కాం గ్రెస్) కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా హర్షవర్ధన్ పాటిల్ ఒక్కరి పేరే వినిపిస్తోంది. ఎన్సీపీ నుంచి దత్తాత్రేయ భర ణే, పోటీకి సై అంటున్నారు. పొత్తు లేకపోతే వీరి మధ్యనే పోటీ ఉం టుంది. ఎమ్మెన్నెస్ నుంచి డాక్టర్ శశికాంత్ టికెట్ ఆశిస్తుం డగా, మహాకూటమి లేకపోతే బీజేపీ నుంచి మావూరీ చౌరే, శివసేన నుంచి విశాల్ బోంద్రే, నితిన్ కదమ్, శేత్‌కారి సంఘటన పార్టీ నుంచి ప్రదేశ్ అధ్యక్షులు విఠల్ పవార్ పేర్లు వినిపిస్తున్నాయి.

 పురంధర్-హవేలీ...
 పురంధర్-హవేలీ నియోజకవర్గంఎమ్మెల్యేగా విజయ్ శితారే (శివసేన)కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయ్ ఒక్కరే బరిలో దిగుతున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి బాబా జాధవ్ రావ్,  గంగాధర్ జగదాలే సీటు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్ టికవడే, సుధాంరావు ఇంగలే, దిగంబర్ దుర్గాడే పేర్లు వినిపిస్తున్నాయి. పొత్తులు లేకపోతే కాంగ్రెస్ నుంచి సంజయ్ జగతాప్ పొటీకి సై అంటున్నారు.

 భోర్-వేల్హా-ముల్షీ...
 భోర్-వేల్హా-ముల్షీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సంగ్రామ్ తోపట్ (కాంగ్రెస్) కొనసాగుతున్నారు. ప్రస్తుతం సంగ్రామ్‌కే తిరిగి సీటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోత్తులు లేకపోతే ఎన్సీపీ నుంచి రఘునాథ్ కింద్రే, రంజిత్ శివతారే, విక్రమ్ ఖట్‌వడ్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. శివసేన నుంచి బాబాభావు బేడకే, కుల్ దీప్ కోండ్రే, శరద్ జమాలే పోటీ పడుతున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అభ్యర్థులు ఎవరూ లేరు.

 ఆంబేగావ్...
 ఆంబేగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దిలీప్ వల్సేపాటిల్ (ఎన్సీ పీ) కొనసాగుతున్నారు. ఈసారి టిక్కెట్ కోసం మంగళా దాస్ బాందల్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. శివసేన నుంచి జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు అరుణగిరే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ, ఎమ్మెన్నెస్ నుంచి పోటీకి ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు.

 బారామతి...
 బారామతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కొనసాగుతున్నారు. అజిత్‌కు వ్యతిరేకంగా ఎన్సీపీకే చెందిన చంద్రకాంత్ కదమ్ పోటీకి సిద్ధపడుతున్నారు. చంద్రకాంత్ అంధుడు కావడంతో ఇక్కడ పోటీ చర్చనీయాంశమైంది. ఎమ్మెన్నెస్ నుంచి వినోద్ భావలే, శివసేన నుంచి అడ్వకేట్ రాజేంద్ర కాలే పేర్లు వినిపిస్తుండగా, పోత్తులు లేకపోతే కాంగ్రెస్ నుంచి అడ్వకేట్ రవీంద్ర రణసింగ్, ఆకాష్ మోరే  సీటు కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.

 ఖేడ్...
 ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దిలిప్ మోహితే (ఎన్సీపీ) కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్సీపీ నుంచి పోటీ చేయాలని  జిల్లా పరిషత్ సభ్యులు సురేష్ గోరే తీవ్రంగా కషి చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అశోక్ ఖాండేభరాడ్, శివసేన నుంచి రాం గావడే, అజిత్ బుట్టే పాటిల్, రాజేష్ జవలేకర్ ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. పొత్తు లేకపోతే కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షులు వందనా తాయి సాత్‌పుతే పోటీ చేయాలని చూస్తున్నారు.

 పొత్తులపై చర్చలు షురూ
 ప్రస్తుతం  పొత్తులపై ఆయా పార్టీలో చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పొత్తుల్లో భాగంగా సీట్లు తారుమారైతే, పార్టీల సీట్లు రాకపోతే,  స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగేందుకు వెనుకాడేది లేదని కొందరు తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా పార్టీలకు పొత్తులు, అభ్యర్థులు, సీట్లు, రెబల్‌ల బెడదతో తలనొప్పిగా మారింది. అభ్యర్థులను ఒకే తాటిపైకి తేవాలనే పార్టీల ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement