సినీ తరహా దొంగతనం | Along the lines of film theft | Sakshi
Sakshi News home page

సినీ తరహా దొంగతనం

Published Fri, Mar 24 2017 5:07 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

Along the lines of film theft

రూ.15 కోట్ల బంగారం కొట్టేశారు!
తిరునల్వేలి(తమిళనాడు): ఒక సినిమాను చూసిన తర్వాత అచ్చం ఆసినిమాలో హీరోలా ఉండాలి. అతనిలా ఎదగాలి అనుకుంటాం. సినిమాలో హీరో దొంగ తనం చేస్తే  ఆసినిమా తరహాలో దొంగతనం చెయ్యాలి అనుకుంటారు. ఈ దొంగలు ఏ సినిమాను, ఏ హీరోను ఫాలో అయ్యారో కానీ అచ్చం  సినిమా తరహాలోఈ దొంగతనం చేశారు . సినిమాలో దొంగలు ముందుగానే రిక్కి నిర్వహించి దొంగతనం చేస్తారు.
 
రిక్కి నిర్వహించిన ఈదొంగలు  ఏకంగా భవనం పైకప్పుకు కన్నం వేసి దొంగతనం చేశారు. తిరునల్వేలిలో దొంగలు రెచ్చిపోయి. ఓ నగల దుకాణానికి  కన్నం వేసి రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకుపోయారు. గురువారం రాత్రి మురుమన్‌కురిచిలోని ఓ నగల దుకాణంలో పైకప్పునకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన నలుగురు దుండగులు 60 కిలోల బంగారం ఆభరణాలను మూటగట్టుకు పోయారు. పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం నుంచి దుకాణంపైకి చేరుకున్న దుండగులు కప్పునకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించారని, శుక్రవారం ఉదయం దుకాణం సిబ్బంది వచ్చి చూసేదాకా విషయం బయటకు తెలియలేదు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement