కాంగ్రెస్ పార్టీకి అమీషా పటేల్ ప్రచారం
కాంగ్రెస్ పార్టీకి అమీషా పటేల్ ప్రచారం
Published Fri, May 2 2014 7:42 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హమీర్ పూర్: హిమాచల్ ప్రదేశ్ లో బాలీవుడ్ నటి అమీషా పటేల్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లోకసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రాజేంద్రర్ రానాకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
బీజేపీ అభ్యర్ధి, హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై అమీషా పటేల్ నిప్పులు చెరిగారు. ముంబై, దుబాయ్, దక్షిణాఫ్రికాలో కనిపించే అనురాగ్ ను గెలిపిస్తే ప్రజలు కష్టాలు పడాల్సిందేనన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండే రానాను గెలిపించాలని అమీషా చెప్పారు. రానాకు మద్దతుగా హమీర్ పూర్ నియోజకవర్గంలో అమీషా పటేల్ రోడ్ షోలో నిర్వహించారు.
Advertisement
Advertisement