బిజ్నోర్, బాగ్పట్: కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఎగతాళి చేశారు. అమేథీ ప్రజలు రాహుల్ సామర్థ్యం, పనితీరుపై ప్రశ్నిస్తారన్న భయంలోనే ఆయన కేరళ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నికల పోరు జరగనున్న పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం అమిత్‌షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ‘అమేథీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రాహుల్ వయనాడ్‌కు పారిపోయారు. అక్కడ బుజ్జగింపుల ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’ అని అమిత్‌షా విమర్శించారు
. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వారు దేశ రక్షణను నిర్లక్ష్యం చేశారు. దేశంలో ఎక్కడినుంచి పోటీచేసినా ప్రజలు ఈ విషయంపై తప్పకుండా ప్రశ్నిస్తారు అని షా అన్నారు. దళిత ప్రతినిధి అయిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ‘నేను రాహుల్ గాంధీని ప్రశ్నించదలిచాను. ఎందుకు మీ తాతగారు అంబేడ్కర్‌ను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు? పార్లమెంట్‌లో ఆయన ఫొటో ఎందుకు లేదు? ఇవాళ దళిత ఓట్ల కోసం అంబేడ్కర్ పేరును కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోంది’ అని మండిపడ్డారు. ప్రధాని మోదీ హయాంలోనే అంబేడ్కర్‌కు సముచిత స్థానం లభించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment