న్యూఢిల్లీ : శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు యావత్ భారత్ జేజేలు పలుకుతుండగా.. ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఆయన సాహసాన్ని కొనియాడుతూ ప్రత్యేక యాడ్‌ను రూపొందించింది. అమూల్ చేసే సృజనాత్మక ప్రకటనలు.. భారతీయ అడ్వర్‌టైజింగ్‌లో ఎంతో ఉన్నతంగా నిలుస్తాయన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ కమ్యూనికేషన్స్‌లో అమూల్ మించిన వారు ఇంకెవ్వరూ ఉండరని చాలా సార్లు నిరూపితమైంది. అయితే తాజాగా అభినందన్ ధీరత్వాన్ని ఆయన మీసంతో పోల్చుతూ.. ఇది అముల్ మీసం అంటూ, మీసం లేనిది ఏం లేదూ అనే క్యాప్షన్‌తో సృజనాత్మకమైన ప్రకటనను విడుదల చేసింది. (చదవండి: అభి మీసం)
యాడ్ మొత్తం భారత హీరో వర్థమాన్‌ను కొనియాడుతూ ఉండగా.. అతన్ని సాహసాన్ని మెచ్చిన జనాలు అతని మీసం స్టైల్‌ను ఫాలో అవుతూ గర్వంగా ఫీలవుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ వీడియోను అమూల్ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆయన మీసం స్టైల్ ఫొటోలను పోస్ట్ చేస్తూ భారత హీరోపై ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా యాడ్స్ రూపొందించి అమూల్ మార్కెట్‌ను క్యాచ్ చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. గతంలో కరుణానిధి మరణించినప్పుడు ఆయనకు నివాళులర్పిస్తూ రూపొందించిన యాడ్ కూడా జనాలకు చేరువైంది. (చదవండి: సరిహద్దుకు అటూ.. ఇటూ..)
#Amul Mooch: To Abhinandan from Amul! pic.twitter.com/NAG3zNMlIL
— Amul.coop (@Amul_Coop) 2 March 2019
భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. అభినందన్‌ను శుక్రవారం విడుదల చేసింది. (చదవండి : ఆకాశం ముద్దాడిన వేళ..)
Comments
Please login to add a commentAdd a comment