పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి.. | 'Anti-Romeo' cop harasses girl, transferred to police lines | Sakshi
Sakshi News home page

పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి..

Published Thu, Mar 30 2017 12:34 PM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి.. - Sakshi

పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి..

ఆగ్రా: యువతులు, మహిళలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూసేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ యాంటీ రొమియో పోలీసు బృందాలను క్రీయాశీలం చేయగా ఓ పోలీసు మాత్రం అదుపు తప్పాడు. ఇతరులు వేధిస్తే అడ్డుకోవాల్సింది పోయి తానే ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఫలితంగా అతడిపై వెంటనే బదిలీ వేటు పడింది.

వివరాల్లోకి వెళితే.. మెయిన్‌పురికి చెందిన ఎస్సై రామ్‌ నరేశ్‌ యాదవ్‌ యాంటీ రోమియో డ్రైవ్‌లో భాగంగా లోహియాలోని ఓ పార్క్‌ వద్దకు వెళ్లి ఓ అమ్మాయిని వేధించాడు. ఆమె చెవులుపట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడితో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు అక్కడ ఉన్న అమ్మాయిలపై అరుస్తూ పార్క్‌ల చుట్టూ తిరగకుండా ఇంటికి వెళ్లిపోండంటూ గట్టిగా రిచారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చి పెద్ద వైరల్‌గా మారింది. దీంతో అతడిని వెంటనే పోలీస్‌ లైన్స్‌కు బదిలీ చేశారు. దీనిపై డిపార్ట్‌మెంటల్‌ దర్యాప్తు కూడా ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement