సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. చెన్నైలోని థౌజండ్ లైట్స్‌లో ఉన్న అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాంపేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్, బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ప్రతాప్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment