Appolo Hospitals
-
గౌతమ్‌రెడ్డి మృతిపై అసత్య ప్రచారం.. ఖండించిన కుటుంబ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్‌రెడ్డి మృతి చెందినప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై ఆయన కుటుంబం స్పదించింది. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... ► ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరారు. ► 06.00 గంటలకు రోజూలాగే ఉదయాన్నే ఆయన మేల్కొన్నారు. ► 06:30 గంటల వరకూ మంత్రిగారు ఫోన్లతో కాలక్షేపం చేశారు. ► 07.00 గంటలకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో మంత్రి కూర్చుని ఉన్నారు. ► 07:12 గంటలకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. ► 07:15గంటలకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోఫా నుంచి ఆయన మెల్లిగా కిందకి ఒరిగారు. ► 7:16 గంటలకు మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి కంగారు పడి గట్టిగా అరిచారు. ► 07:18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతి మీద చేయితో నొక్కి డ్రైవర్ నాగేశ్వరరావు స్వల్ప ఉపశమనం కలిగించారు. ► 07:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు. ► 07:20 గంటలకు మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భార్య శ్రీకీర్తి.. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ► 07:22 ‘నొప్పి పెడుతుంది కీర్తి’ అంటున్న మంత్రి మాటలకు స్పందించి.. అక్కడి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు. ► 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటి డ్రైవర్, సిబ్బంది చేర్చారు. ► 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. ► 09:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ► 09:15 గంటలకు మంత్రి మేకపాటి మృతిచెందినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు. -
అపోలో ఆసుపత్రికి హీరో అల్లు అర్జున్..
Allu Arjun Visits His Cousin Sai Dharam Tej In Apollo Hospital:మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు తేజ్ ఆరోగ్య పరిస్థితిని క్లోజ్‌గా మానీటరింగ్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా గురువారం అల్లు అర్జున్ అపోలో ఆసుపత్రికి చేరుకొని సాయ్‌తేజ్‌ను పరామర్శించారు. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం అనంతరం చిరంజీవి, పవన్‌కల్యాణ్ సహా మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు అపోలో ఆసుపత్రికి వచ్చి తేజ్‌ను పరామర్శించారు. అయితే ఆ సమయంలో బన్నీ 'పుష్ప' షూటింగ్ నిమిత్తం కాకినాడ వెళ్లడంతో అప్పుడు రాలేకపోయారు. గురువారం షూటింగ్ అనంతరం హైదరాబాద్ వచ్చిన బన్నీ నేరుగా సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' అనారోగ్య సమస్యలతో బిగ్‌బాస్-4 విజేత అభిజిత్ -
అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న చెల్లెలికి మూత్రపిండం దానం చేసేందుకు ముందుకొచ్చిన అన్నకు హైకోర్టులో ఊరట లభించింది. భార్య అనుమతి ఉంటే తప్ప కిడ్నీ దానం చేసేందుకు అనుమతించబోమంటూ అపోలో హాస్పిటల్స్ చేస్తున్న వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. భార్యాభర్తల మధ్య విడాకుల కేసు నడుస్తున్నందున భార్య సమ్మతి లేకుండానే కిడ్నీ దానానికి అనుమతించాలని, వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించాలని అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వివరాలు... నగరానికి చెందిన కె. వెంకట్ నరేన్ (39), బి.మాధురిలు అన్నాచెల్లెళ్లు. మాధురికి 2012లో వివాహమైంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాధురిని పరీక్షించిన అపోలో వైద్యులు ఆమెకు మూత్రపిండం ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరని తేల్చారు. వైద్య పరీక్షల అనంతరం వెంకట్ నరేన్ మూత్రపిండాన్ని అమర్చేందుకు అనుకూలంగా ఉందని నిర్ధారించారు. అయితే వెంకట్ నరేన్ భార్య సమ్మతి ఉంటే తప్ప ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించబోమన్నారు. దీంతో వెంకట్ నరేన్ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: దళితబంధు పథకాలివే -
అమ్మాపురం రాజా సోంభూపాల్ కన్నుమూత
సాక్షి, కొత్తకోట : అమ్మాపురం సంస్థానాదీశులు, అమరచింత మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్ ఆదివారం హైద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. అమ్మాపురం సంస్థానానికి రాణి భాగ్యలక్ష్మమ్మ సంస్థానాదీశులుగా కొనసాగిన అనంతరం అమ్మాపురం సంస్థానానికి రాజుగా ముక్కెర వంశానికి చెందిన రాజా సోంభూపాల్‌కు పట్టాభిషేకం చేపట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం సంస్థానాలను విలీనం చేసే సమయంలో 1962, 1967 సంవత్సరాల్లో అమరచింత నియోజకవర్గానికి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అనంతరం 1979 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరారెడ్డిపై ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచిరాజకీయాలకు దూరంగా ఉన్నారు. కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేశారు. రాజసోంభూపాల్‌కు కుమారుడు రాంభూపాల్, కూతురు గౌరీదేవీ ఉన్నారు. నేడు స్వగ్రామమైన అమ్మాపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తనయుడు రాజాశ్రీరాంభూపాల్ తెలిపారు. -
కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి
-
విషమంగా ముఖేష్ గౌడ్ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. కొన్ని నెలలుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలిసింది. అతని శరీరం వైద్యానికి సహకరించపోవడంతో వైద్యులు చికిత్స నిలిపివేశారు. కాగా ఎన్నికల సమయంలో ఆయన అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నా ఇప్పటి వరకూ ఆయన కోలుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్‌ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. -
పోలీసులు చెప్పినందుకే..
చెన్నై: తమిళనాడు సీఎం దివంగత జయలలితకు చికిత్స సందర్భంగా ఆసుపత్రి కారిడార్లలో సీసీటీవీలను పోలీసుల సూచన మేరకే ఆపేశామని అపోలో ఆసుపత్రి ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సత్యమూర్తి ఆదేశాల మేరకే ఇలా చేశామని అపోలో గ్రూప్ న్యాయవాది కమిషన్‌ముందు అఫిడవిట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జయలలితను గది నుంచి బయటకు తీసుకొచ్చిన సమయంలో కారిడార్లలో సీసీటీవీలను ఆపేయడంతో పాటు మెట్లదారిని మూసివేసేవారమని ఆమె తెలిపారు. లిఫ్ట్ ద్వారా ఆమెను వేరే అంతస్తులోకి తరలించాల్సి వస్తే మిగతా లిఫ్టులను నిలిపివేసేవాళ్లమన్నారు. జయలలిత చికిత్స గదిలోకి వెళ్లిపోగానే సీసీటీవీలను ఆన్ చేసేవాళ్లమని అపోలో గ్రూప్ న్యాయవాది పేర్కొన్నారు. -
అపోలో ప్రతాప్ రెడ్డికి గుండెపోటు
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. చెన్నైలోని థౌజండ్ లైట్స్‌లో ఉన్న అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాంపేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్, బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ప్రతాప్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
జయ చికిత్స వివరాలు ఇవ్వండి
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స వివరాలను తెలియజేయాలని అపోలో ఆస్పత్రికి విచారణ కమిషన్ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ లోగా పూర్తి వివరాలు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. అలాగే స్వయంగా విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అపోలో ఆస్పత్రి బాధ్యులతో పాటు జయలలిత సహాయకుడు పూంగుండ్రన్, డాక్టర్ అశోక్ కుమార్‌లకు కూడా ఈ నెల పన్నెండున విచారణకు హాజరు కావాలని విచారణ కమిషన్ నోటీసులు పంపింది. -
టెన్షన్..టెన్షన్.. అపోలో రోగుల తరలింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాల్లో ముఖ్యంగా చెన్నైలో అప్రమత్తత పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలోని పలు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ముందస్తుగా ఇంటికి పంపించేస్తున్నాయి. కొన్ని సంస్థలు మధ్యాహ్నానికే సెలవులు ప్రకటించాయి. మరోపక్క, జయ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీరియస్ కేసులను సైతం జాగ్రత్తగా అంబులెన్స్‌ల ద్వారా వేరే ఆస్పత్రులకు మారుస్తున్నారు. వారి రోగాన్ని బట్టి ఇతర నగరాల్లోని ఆస్పత్రులకు కూడా వారిని తరలిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క, జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోతోంది. ఆస్పత్రి వద్ద కాస్తంత ఉద్విగ్న పరిస్థితి నెలకొనడం, ఆస్పత్రిలోని రోగులను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్న నేపథ్యంలో జయను తమకు చూపించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు, బ్లాక్ కమాండోస్‌ను రంగంలోకి దించారు. మొత్తానికి తమిళనాడు అంతటా కూడా ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కనిపిస్తోంది. -
24 గంటలు గడిస్తే తప్ప..!
24 గంటల్లో జయలలితకు చికిత్స స్పందించే అవకాశం: వైద్యులు చెన్నై: ఆరోగ్యం తీవ్రంగా విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ కోలుకోవడంపై 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని చెన్నైలోని అపోలో వైద్య వర్గాలు చెప్తున్నాయి. రానున్న 24 గంటలు జయలలితకు అత్యంత కీలకమని, ఆమె చికిత్సకు స్పందించడానికి 24 గంటల సమయం పట్టవచ్చునని వైద్యులు తెలిపారు. అదేసమయంలో జయలలిత రక్తపోటు, హృదయ స్పందన (హార్ట్‌రేట్), శ్వాస, బాడీ టెంపరేచర్ వంటివి వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జయలలితకు ఆదివారం సాయంత్రం తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమెకు ‘ఈసీఎంవో’ ఏర్పాటు చేశామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈసీఎంవో అంటే ‘ఎక్స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్’.. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేకపోయినప్పుడు ఈ యాంత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. జయలలిత ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని అపోలో ఆస్పత్రి విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించడంతో తమిళనాడు అంతటా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్షణక్షణం అమ్మ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుండటంతో ఒక్క చెన్నై నగరంలోనే 15వేలమంది బలగాలను మోహరించారు. అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న షాపులన్నింటినీ ఖాళీ చేయించి.. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.