’రాహుల్ ఈ ఆపరేషన్ మనసుపెట్టి ఆలోచించు’
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ హయాంలో నల్లధనాన్ని ఎందుకు రూపుమాపలేకపోయారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రశ్నించారు. ఏదో నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల కుభేరుల భరతం పట్టేందుకే ఇలాంటి ప్రయోగం చేయాల్సి వచ్చిందని జైట్లీ తెలిపారు.
ఇలాంటి ఆపరేషన్‌లో సామాన్యులకు ఇబ్బందులు తాత్కాలికమే అని జైట్లీ చెప్పారు. రాహుల్ ఈ విషయంలో మనసు పెట్టి ఆలోచించాలని కోరారు. బ్లాక్ మనీని నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. పలుసార్లు ఆర్థికమంత్రిగా పనిచేసిన చిదంబరం పెద్ద నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.