big currency ban
-
కొడుకు బాటలో తండ్రి.. జయపై కరుణ ఫైర్
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కూడా తన కుమారుడు స్టాలిన్ బాటలో నడిచారు. పెద్ద నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి జయలలిత ఎందుకు స్పందించలేదని, స్టాలిన్ వేసిన ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉప ఎన్నికల్లో తమ పార్టీకి విజయం కట్టబెట్టాలని జయ కోరారే తప్ప డబ్బులు చేతిక రాక జనాలు పడుతున్న అవస్థల గురించి ఆమె ఎందుకు ప్రకటన చేయలేదని మండిపడ్డారు. కనీసం ప్రజలను ఇబ్బందుల నుంచి పడేసే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాకపోయినా ఆ పార్టీలో ఒక్క వ్యక్తికి కూడా పెద్ద నోట్లు రద్దు విషయంలో ప్రకటన చేసే తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలకు తన అనారోగ్యం కారణం దృష్ట్యా వెళ్లలేనని, తమ అభ్యర్థులనే ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
’రాహుల్ ఈ ఆపరేషన్ మనసుపెట్టి ఆలోచించు’
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ హయాంలో నల్లధనాన్ని ఎందుకు రూపుమాపలేకపోయారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రశ్నించారు. ఏదో నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల కుభేరుల భరతం పట్టేందుకే ఇలాంటి ప్రయోగం చేయాల్సి వచ్చిందని జైట్లీ తెలిపారు. ఇలాంటి ఆపరేషన్లో సామాన్యులకు ఇబ్బందులు తాత్కాలికమే అని జైట్లీ చెప్పారు. రాహుల్ ఈ విషయంలో మనసు పెట్టి ఆలోచించాలని కోరారు. బ్లాక్ మనీని నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. పలుసార్లు ఆర్థికమంత్రిగా పనిచేసిన చిదంబరం పెద్ద నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.