కొడుకు బాటలో తండ్రి.. జయపై కరుణ ఫైర్ | Karuna's poser to Jaya | Sakshi
Sakshi News home page

కొడుకు బాటలో తండ్రి.. జయపై కరుణ ఫైర్

Published Wed, Nov 16 2016 1:42 PM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

కొడుకు బాటలో తండ్రి.. జయపై కరుణ ఫైర్ - Sakshi

కొడుకు బాటలో తండ్రి.. జయపై కరుణ ఫైర్

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కూడా తన కుమారుడు స్టాలిన్ బాటలో నడిచారు. పెద్ద నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి జయలలిత ఎందుకు స్పందించలేదని, స్టాలిన్ వేసిన ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉప ఎన్నికల్లో తమ పార్టీకి విజయం కట్టబెట్టాలని జయ కోరారే తప్ప డబ్బులు చేతిక రాక జనాలు పడుతున్న అవస్థల గురించి ఆమె ఎందుకు ప్రకటన చేయలేదని మండిపడ్డారు.

కనీసం ప్రజలను ఇబ్బందుల నుంచి పడేసే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాకపోయినా ఆ పార్టీలో ఒక్క వ్యక్తికి కూడా పెద్ద నోట్లు రద్దు విషయంలో ప్రకటన చేసే తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలకు తన అనారోగ్యం కారణం దృష్ట్యా వెళ్లలేనని, తమ అభ్యర్థులనే ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement