సాక్షి, న్యూఢిల్లీ : మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం విపక్షం అనుసరించాల్సిన వైఖరిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో మంగళవారం సంప్రదింపులు జరిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపైనా ఇరువురు నేతలు ఫోన్‌లో చర్చించారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకే ఆప్ ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పస్టం చేశారు.
అఖిలేష్‌తో కేజ్రీవాల్ చర్చల సారాంశాన్ని వివరిస్తూ మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఫలితాల అనంతరం విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపైనే అఖిలేష్‌తో కేజ్రీవాల్ చర్చించారని చెప్పారు. నరేంద్ర మోదీ-అమిత్ షా మతోన్మాద జోడీతో పాటు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డకోవడమే ఆప్ ప్రాధాన్యతని చెప్పుకొచ్చారు.
అఖిలేష్‌తో కేజ్రీవాల్ భేటీ మర్యాదపూర్వకంగా సాగిందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయని, దేశవ్యాప్తంగా బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. యూపీలో మహాకూటమికి 60 స్ధానాలు పైగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment