మాజీ డీజీపీ ఆత్మహత్య! | assam ex dgp commits suicide | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ ఆత్మహత్య!

Published Wed, Sep 17 2014 4:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

మాజీ డీజీపీ ఆత్మహత్య! - Sakshi

మాజీ డీజీపీ ఆత్మహత్య!

అసోం రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శంకర్ బారువా ఆత్మహత్య చేసుకున్నారు. కోట్లాది రూపాయల శారదాస్కాంలో సీబీఐ వర్గాలు ఇటీవలే ఆయనను విచారించాయి. ఆయన అసోం రాజధాని గువాహటి నగరంలోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయన తన రివాల్వర్తో కణత మీద కాల్చుకుని మరణించినట్లు తెలిసింది.

పదిహేను రోజుల క్రితం శారదా స్కాంలో సీబీఐ అధికారులు శంకర్ బారువాను విచారించాయి. దానిమీద టీవీ ఛానళ్లు నాన్ స్టాప్ కవరేజి ఇచ్చాయి. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గత వారం రోజుల క్రితం ఛాతీలో తీవ్రమైన నొప్పిగా ఉందని ఆయన స్థానిక ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా పొందారు. జరిగిన పరిణామాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని తాము అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

అయితే, అసలు తాము బారువాను విచారించనే లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. శారదాగ్రూపులోని మీడియా సంస్థకు చెందిన ఓ ఉద్యోగి తనకు అసోంలో ప్రముఖ గాయకుడు, దర్శకుడు సదానంద గొగోయ్ రక్షణ కల్పించారని చెప్పడంతో దాని గురించి అడిగేందుకే వెళ్లామని సీబీఐ అధికారులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement