అటల్ పెన్షన్ ‘సహాయం’ మార్చి 31 వరకు.. | Atal pension 'Help' on March 31 .. | Sakshi
Sakshi News home page

అటల్ పెన్షన్ ‘సహాయం’ మార్చి 31 వరకు..

Published Wed, Jan 20 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

Atal pension 'Help' on March 31 ..

న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన పథకానికి (ఏపీవైకి) కార్మికులు చెల్లించే చందాలో సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరించేందుకు ఉద్దేశించిన గడువును కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ పథకంలో చేరే అసంఘటితరంగ కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ఆ కార్మికులకు నిర్ధారిత రిటైర్మెంట్ వయసు పూర్తయ్యాక నెలకు కనీసం రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ అందిస్తారు.

గతేడాది జూన్‌లో ఈ పథకాన్ని ప్రకటించిన కేంద్రం... తొలి ఆరు నెలల్లో అంటే గత డిసెంబర్ 31 నాటికి ఈ పథకంలో చేరే కార్మికులు ఏటా చెల్లించే చందాలో 50శాతం లేదా రూ. 1,000లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఐదేళ్లపాటు చెల్లిస్తామంది. ఈ పథకంలో ఇప్పటివరకు దాదాపు 12.5లక్షల మంది కార్మికులు చేరారు. అయితే మరింత మందికి ప్రయోజనం కల్పించేందుకు గడువు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement