స్టేషన్‌లో ఆటోమెటిక్‌ గేట్లు | Automatic gates at the station | Sakshi
Sakshi News home page

స్టేషన్‌లో ఆటోమెటిక్‌ గేట్లు

Published Mon, Jul 10 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

స్టేషన్‌లో ఆటోమెటిక్‌ గేట్లు

స్టేషన్‌లో ఆటోమెటిక్‌ గేట్లు

న్యూఢిల్లీ: రద్దీ సమయాల్లో ప్రయాణికుల టికెట్‌ చెకింగ్‌కు బార్‌ కోడ్‌ స్కానర్స్‌తో కూడి న ఆటోమెటిక్‌ ప్లాప్‌ గేట్లను పైలెట్‌ ప్రా జెక్టుగా రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రైల్వేను టికెట్‌ కలెక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా టికెట్‌ కలెక్టర్, ఎగ్జామి నర్లపై పని భారం తగ్గే అవకాశం ఉందని ఓ సీనియర్‌ రైల్వే అధికారి వెల్లడించారు.

మూడు నెలల్లో ఢిల్లీ డివిజన్‌లోని బ్రార్‌ స్క్వేర్‌ స్టేషన్‌లో ఆటోమెటిక్‌ ప్లాప్‌ గేట్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ తక్కువ కావడంతోనే దీనిని  ఎంచుకున్నామన్నారు. టికెట్‌ లేని ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలు లేకుండా స్టేషన్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల రద్దీ సమ యంలో ఢిల్లీ, కోల్‌కతా మెట్రోలు మాత్రమే ప్లాప్‌ గేట్ల విధానాన్ని అమలు చేస్తున్నాయి

దివ్యాంగుల కష్టాలకు చెక్‌
దివ్యాంగుల ప్రయాణ కష్టాలను తొలగిం చేందుకు రైల్వే శాఖ నడుంబిగించింది. ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ రైళ్లలో దివ్యాంగుల కోసం థర్డ్‌ ఏసీ కోచ్‌లోని లోయర్‌ బెర్త్‌లను ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలో వెలువడనుంది. ఇటీవల నాగ్‌పూర్‌–నిజాముద్దీన్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో పారా అథ్లెట్‌ సుభర్ణ రాజ్‌ పై బెర్త్‌ ఎక్కలేక కింద పడుకున్న ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల కోసం అన్ని స్టేషన్లలో ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించడంతో పాటు చూపు లేని వారు కోచ్‌లను గుర్తించేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం స్లీపర్‌ క్లాస్‌లోని లోయర్‌ బెర్త్‌లను మాత్రమే దివ్యాంగులకు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement