
లక్నో : పాకిస్తాన్‌లోని బాలకోట్‌లో జరిగిన మెరుపు దాడులను బీజేపీ రాజకీయం చేస్తోందని విపక్షాలు విమర్శలకు దిగుతున్న నేపథ్యంలో తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వైమానిక దాడులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాహస చర్యతో నరేంద్ర మోదీ ప్రభుత్వం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మరోసారి అధికారంలోకి వస్తుందని యోగి ఆదిత్యానాథ్ ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్ధానాలకు గాను బీజేపీ 74 స్ధానాల్లో గెలుపొందుతుందని యూపీ సీఎం ట్వీట్ చేశారు. యూపీలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన యోగి ఓ కవితను ట్వీట్‌లో పొందుపరిచారు. పాక్‌లో చేపట్టిన వైమానిక దాడులపై సందేహాలు లేవనెత్తుతూ విపక్షాలు భారత సైన్యం నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించాయని వరుస ట్వీట్లలో ఆయన మండిపడ్డారు. కాగా మెరుపు దాడులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉపకరిస్తాయని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప సహా ఆ పార్టీ నేతలు పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment