లక్నో : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తన ట్విటర్ ఖాతా ద్వారా అచ్చం సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను పోలిన ఓ ‘‘బాబా’’ను పరిచయం చేశారు. ఆదిత్యనాధ్ మాదిరిగానే ఆ వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి, గుండు కొట్టించుకుని ఉన్నారు. చూడడానికి యోగిలానే కనిపిస్తున్నప్పటికి అతని ముఖం మాత్రం ఆ ఫోటోలో కనిపించడం లేదు.
తన వెనుకాల నడిచి వస్తున్న ఈ బాబా ఫోటోలను అఖిలేశ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మనం నకిలీ దేవుడ్ని తీసుకురాలేం. కానీ మేము ఓ ‘బాబా’ని తీసుకొచ్చాం. గోరఖ్‌పూర్ నుంచి ఆయన బయల్దేరారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వాన్ని గురించి నిజాలు చెప్పబోతున్నారు...’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. కాగా ఈ లోక్‌సభ ఎన్నికల ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే . బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీలు వరుసగా 38, 37, 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
हम नक़ली भगवान नहीं ला सकते पर एक बाबा जी लाए हैं। ये हमारे साथ गोरखपुर छोड़ प्रदेश में सबको सरकार की सच्चाई बता रहे हैं। pic.twitter.com/GxlS0LYb6z
— Akhilesh Yadav (@yadavakhilesh) May 4, 2019
Comments
Please login to add a commentAdd a comment