ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాది గ్రిడ్ నుంచి మిగులు విద్యుత్ ను ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఎంపీ బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. గురువారం తెలంగాణ విద్యుత్ సమస్యలను పీయూష్ దృష్టికి తీసుకువెళ్లిన దత్తాత్రేయ ఈమేరకు విన్నవించారు.
ఉత్తరాది గ్రిడ్ నుంచి మిగులు విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. దీంతో పాటు సోలార్, థర్మల్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పాలని మంత్రికి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.