'జాగ్రత్త.. కాస్త సున్నితంగా ఉండండి' | Be sensitive to surroundings: PM's message to young IAS officers | Sakshi
Sakshi News home page

'జాగ్రత్త.. కాస్త సున్నితంగా ఉండండి'

Published Tue, Aug 2 2016 4:55 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

'జాగ్రత్త.. కాస్త సున్నితంగా ఉండండి' - Sakshi

'జాగ్రత్త.. కాస్త సున్నితంగా ఉండండి'

న్యూఢిల్లీ: చుట్టూ ఉండే వాతావరణం, పరిసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. కాస్తంతా సున్నితంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనను ఎలాంటి భయం లేకుండా ప్రతి ఐఏఎస్ అధికారి సంప్రదించవచ్చని అన్నారు.

కొత్తగా విధుల్లోకి చేరుతున్న 2014 బ్యాచ్ ఐఏఎస్ లను కలిసిన సందర్భంగా వారితో ప్రధాని మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ పాలనలో భాగస్వాములవ్వాలని చెప్పారు. తొలుత అసిస్టెంట్ సెక్రటరీలుగా వ్యవహరించే మీరంతా సీనియర్ అధికారులను సంప్రదించే విషయంలో, అనుభవం నేర్చుకునే విషయంలో రాజీపడొద్దని, పెద్దవారనే భ్రమలో ఇరుక్కోవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement