తల్లి పాలతోనే ఆరోగ్యం | Benefits of nursing moms celebrated at Support Stroll | Sakshi
Sakshi News home page

తల్లి పాలతోనే ఆరోగ్యం

Published Sat, Aug 2 2014 12:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

తల్లి పాలతోనే ఆరోగ్యం - Sakshi

తల్లి పాలతోనే ఆరోగ్యం

వేలూరు: పురిటి బిడ్డలకు తల్లిపాలతోనే ఆరోగ్యమని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి పురిటి బిడ్డలకు పిల్లలకు ఆరు నెలల వరకైనా తల్లిపాలను ఇవ్వాలని డాక్టర్లు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లి పాలతో చిన్నారులు మంచి పౌష్టికశక్తితో పాటు ఆరోగ్యంగాను ఉంటారన్నారు. ప్రస్తుతం కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్లడంతో చిన్నారులకు తల్లి పాలను ఇవ్వడంతో కాస్త ఇబ్బందులున్నాయన్నారు. కొంత మంది తల్లులు తల్లి పాలు ఇవ్వడం ద్వారా  అందం చెడిపోతుందని పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అటువంటి భ్రమలన్నీ వదిలి పెట్టాలన్నారు.

తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం అన్నారు. దేశంలో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య తగ్గుతుందని వీటిపై ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన అరగంటలోనే తల్లి ముర్రుపాలను ఇవ్వడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. అనంతరం తల్లి పాలు ఇవ్వడంపై మెడికల్ కళాశాల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి డీన్ సిద్ధతియా మున్వర్, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పూంగొ డి, ప్రిన్సిపాల్ భాస్కర్, పెన్నాతూర్ సర్పంచ్ అరుల్‌దాసన్, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
 
కలె క్టర్ కారును అడ్డుకున్న రోగులు
తల్లిపాల వారోత్సవాలను ముగించుకొని వస్తున్న కలెక్టర్ కారును ప్రసవ వార్డులోని రోగులు అడ్డుకుని నిరసన తెలిపారు. తమ వార్డులో తాగునీరు, మరుగుదొడ్లలో నీరు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement