Breast-feeding
-
ముహమ్మద్‌కు పాలుపట్టే అదృష్టం
ఇస్లాం నిప్పులు కురిసే ఎండ, ఎడారి మార్గం. పైగా దూరతీరాల ప్రయాణం. మంచివాహనం ఉన్నవాళ్లు వడివడిగా పట్నం చేరుకొని, సంపన్నుల బిడ్డలను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటే, హలీమా, హారిస్ దంపతులు బక్కచిక్కిన వాహనంపై ఆశనిరాశల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు. ముహమ్మద్ పుట్టాడు. కొడుకు అందాలను చూసుకొని ఆనందంతో మురిసిపోతోంది. ఆ అందాల బాల శశాంకుడు అమాయకపు చూపులతో అప్పుడే ఏదో మూగసందేశం ఇస్తూ దినదినప్రవర్ధమానమవుతున్నాడు. నింగిలోని తారలతో ఆడుకుంటూ, తనదైన భాషలో సంభాషిస్తున్నాడు. పుట్టిన దగ్గరినుండి తల్లిపాలు తాగిన ముహమ్మద్‌కు, అబూలహబ్ ఇంట్లో పనిమనిషి సౌబియా పాలుపట్టే అదృష్టానికి నోచుకుంది. సౌబియా వద్ద వారం రోజులు పాలు తాగిన ముహమ్మద్, ఆచారం ప్రకారం పల్లెవాతావరణానికి పయనమయ్యే సమయం ఆసన్నమైంది. సాధారణంగా అరేబియా వాసుల్లో తమ పిల్లలను పసిప్రాయంలోనే పల్లెవాసాలకు పంపించే ఆచారం ఉండేది. పల్లె వాతావరణంలో పిల్లలు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, స్వేచ్ఛగా పెరుగుతారని, అంతేగాక పల్లెవాసుల భాష నాగరికుల భాషకంటే స్వచ్ఛంగా, నిర్మలంగా, కల్లాకపటం లేకుండా ఉంటుందని, తమ పిల్లలు స్వచ్ఛమైన అరబీ భాష నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పల్లెసీమలకు పంపేవారు. పల్లె పట్టులనుండి ఎంతోమంది ఆయాలు గంపెడాశలతో మక్కాకు చేరుకున్నారు. నిప్పులు కురిసే ఎండ, ఎడారి మార్గం. పైగా దూరతీరాల ప్రయాణం. మంచివాహనం ఉన్నవాళ్లు వడివడిగా పట్నం చేరుకొని, సంపన్నుల బిడ్డలను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటే, హలీమా, హారిస్ దంపతులు బక్కచిక్కిన వాహనంపై ఆశనిరాశల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు. మక్కాకు చేరుకోగానే పిల్లల సంరక్షణార్థం వచ్చిన మహిళలు సంపన్న పిల్లలకోసం గాలింపు మొదలుపెట్టారు. ముందుగా మక్కా చేరుకున్న మాటకారి మహిళలంతా తమ వాక్చాతుర్యంతో పిల్లల తల్లులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సంతృప్తి చెందిన తల్లులు తమకు నచ్చిన ఆయాలను ఎంచుకుంటున్నారు. కాని అందరికన్నా ఆలస్యంగా మక్కా చేరుకున్న దాయి హలీమా ఎవరి దృష్టినీ ఆకర్షించలేకపోయింది. తన వాహనమే కాదు, స్వయంగా తన తన బాహ్య ఆకారమూ బలహీనంగానే ఉంది మరి. ఇలాంటి బలహీన మహిళ తమ పిల్లల ఆలనా పాలన ఎలా చూడగలుగుతుంది? ఎముకలగూడులాంటి ఆ బలహీన దేహంలో పాలెక్కడుంటాయి? అందుకే తల్లులెవరూ హలీమాకు తమ పిల్లల్ని అప్పగించడానికి ముందుకు రాలేదు. అటు అమినా తనయుడి పరిస్థితి కూడా అలాగే ఉంది, పుట్టక ముందే తండ్రి నీడను కోల్పోయి అనాథగా మిగిలిన ముహమ్మద్‌ను పెంచడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కలిగిన వారైతే కానుకలు దండిగా వస్తాయని, పాపం అనాథ తల్లి నుండి ఏమి ఆశించగలమని ఎవరికి వారు వెనక్కి తగ్గారు. ఆయాలంతా సంపన్నుల బిడ్డలను దక్కించుకొని మురిసిపోతూ ఇంటి ముఖం పట్టారు.తన బాబును తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఆమినాను తీవ్రంగా కలచివేసింది. ‘తన బిడ్డ తండ్రి నీడ కోల్పోయిన అభాగ్యుడు. అందుకే ఎవరూ ముందుకు రాలేదు.’ అనుకుంటూ భర్త జ్ఞాపకాలను తలుచుకొని కుమిలిపోతున్నారు ఆమినా. అంతలో ‘అమ్మా! మీ బాబును నాకప్పగించండమ్మా! శాయశక్తులా సంరక్షిస్తానమ్మా’! అంటూ ముందుకొచ్చింది హలీమా. హలీమా మాటలతో అడుగంటిన ఆశలు చిగురించాయి ఆమినాలో. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
తల్లిపాలు లేనప్పుడు ఏ పాలు పట్టాలి?
ఆయుర్వేద కౌన్సెలింగ్ తల్లిపాలు తాగే వయసులోని శిశువులకు, ఆ పాలు తక్కువైనప్పుడు గాని, లభించనప్పుడు గాని ఏ పాలు పడితే మంచిది? ఆయుర్వేదంలో గాడిద పాల గురించి ఏమైనా చెప్పారా? వివరించ ప్రార్థన. - విశాల నేమాని, హైదరాబాద్ ఏ కారణం చేతనైనా తల్లిపాలు లభించనప్పుడు గాని లేదా స్తనాగ్రాలు చిట్లి, పాలివ్వడానికి ఇబ్బంది ఉన్నప్పుడుగాని, తల్లి వ్యాధిగ్రస్థురాలయినప్పుడుగాని, శిశువునకు ఆవుపాలు లేదా మేకపాలు శ్రేష్ఠమని ఆయుర్వేదం వక్కాణించింది. ఆవుపాలగుణాలు: మధురం, శీతం, మృదు, స్నిగ్ధం (జిగురు) గుణాలు కలిగి ఉండి, శిశువునకు ప్రసన్నత కలిగించి, ప్రాణప్రదంగానూ, ఓజోవర్థకంగానూ ఉంటుంది. రక్తస్రావాన్ని అరికట్టే గుణం కూడా ఉంది. (చరక, శుశ్రుత సంహితలు) మేకపాల గుణాలు: మధుర కషాయ రసాలు, శీతం, లఘువు, ఆకలిని పుట్టించి, విరేచనాలను ఎక్కువగా రానివ్వకుండా ఉపకరిస్తుంది. జ్వరం, దగ్గు, ఆయాసాలను రాకుండా నివారిస్తుంది. (సుశ్రుత సంహిత) గాడిదపాల గుణాలు: భావమిశ్రుడు చెప్పిన శ్లోకం: ‘‘శ్వాస వాతహరం సామ్లం లవణం రుచి దీప్తికృత్, కఫకాసహరం బాల రోగఘ్నం గార్ధభీపయః’’ లవణం, అమ్ల రసాలు కలిగి ఉండి, నాలుకకు రుచిని, అగ్ని దీప్తిని కలిగిస్తుంది. కఫాన్ని, దగ్గుని, ఆయాసాన్ని నివారించే, పోగొట్టే గుణం కూడా ఉంది. అందుకే దీనిని బాల రోగహరంగా ప్రస్తావించారు. శిశువునకు నిత్యం పట్టే పాలగా కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే ప్రక్రియ కోసం వాడటం మంచిది. మోతాదు: పుట్టిన వారం రోజుల తర్వాత ఐదుచుక్కలు తాగించాలి. అనంతరం నెలకొకసారి అదే మోతాదులో ఆరునెలలపాటు వాడుకుంటే చాలా రోగాలకు నివారకంగా ఉపకరిస్తుంది. పైన చెప్పిన వ్యాధులలో కూడా పెద్దలు కూడా వాడుకోవచ్చు. మోతాదు: 50 నుండి 100 మిల్లీలీటర్లు- పెద్దలకు, పిల్లలకు వయసును బట్టి మోతాదు మారుతుంది. పాలను మరిగించి చల్లార్చి వాడుకోవాలి. గమనిక: ఆవుపాలను, మేకపాలను మరిగించినప్పుడు లఘు పంచ మూలాలను కలిపి మరిగిస్తే, పాలు దోష రహితమై, శిశువులకు ఆరోగ్యకరమని ఉటంకించారు. వాటిలో మనకు విరివిగా లభించేవి.. నేల వాకుడు (కంటకారి), పల్లేరు (గోక్షుర). పాలల్లో నీళ్లు కలపనవసరం లేదు. శర్కర (చక్కెర)కు బదులుగా పటిక బెల్లం (మిశ్రీ) కొద్దిమోతాదులో కలిపి పిల్లలకు పడితే చాలా మంచిది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఆరు నెలల పాటు బిడ్డకు పాలివ్వండి
బెంగళూరు : శిశువుకు ఆరునెలల పాటు తప్పక చనుబాలు ఇవ్వాలని ప్రముఖ గైనకాలజిస్ట్, గుణశీల ఆసుపత్రి ప్రతినిధి దేవికాగుణశీల పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఆవరణంలో ఆదివారం నుంచి అవగాహన కార్యక్రమాలను ఆసుపత్రి యాజమాన్యం ప్రారంభించింది. ఈ సందర్భంగా దేవికాగుణశీల మాట్లాడుతూ... మారుతున్న జీవన విధానాల వల్ల తల్లి రెండు లేదా మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు శిశువుకు చనుబాలు ఇవ్వడం లేదన్నారు. ఇది శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తమ పరిశీలనలలో తేలిందన్నారు. అంతేకాక శిశువుకు పాలు ఇవ్వక పోవడం వల్ల కొందరిలో క్యాన్సర్‌కు దారితీసే పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న తల్లులతో మేము ఆరునెలల వరకూ బిడ్డకు తప్పక చనుబాలు ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తల్లిపాల వారోత్సవంలో భాగంగా సంస్థ ఆవరణంలో ‘శిశువు-తల్లి పాల ప్రాముఖ్యత’ విషయంపై చిత్రలేఖనం, వక్తృత్వ, నాటికలు, చర్చావేదికల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మెదడుకు మేలు చేసే తల్లిపాలు...
బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ బ్రెయిన్ పూర్తిగా తల్లిపాలపై చాలాకాలం పాటు పెరిగే పిల్లల్లో భాషలను నేర్చుకునే ప్రతిభ, సహజమైన తెలివితేటల వికాసం ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇందుకోసం 1,312 మంది తల్లులను ఎంపిక చేశారు. ఏడేండ్ల పాటు ఈ అధ్యయనం కొనసాగింది. ఆ తర్వాత తల్లిపాలు తాగిన పిల్లల తెలివితేటలనూ, నేర్చుకునే సామర్థ్యాలను కొన్ని ప్రామాణిక పరీక్షల ద్వారా అంచనా వేశారు. ఇందులో తల్లిపాలు తాగిన పిల్లలు చాలా బాగా రాణించారు. అంతేకాదు... భాషలో పట్టు, ఎక్కువ పదసంపద (వకాబులరీ) కలిగి ఉండటం వంటి మంచి లక్షణాలన్నీ తల్లిపాలపై పెరిగిన పిల్లల్లోనే అత్యధికంగా ఉండటాన్ని హార్వర్డ్ పరిశోధకులు గుర్తించారు. కేవలం నేర్చుకునే ప్రతిభ, పదసంపదలు మాత్రమే గాక... తల్లిపాలతో ఒనగూరే ప్రయోజాలన్నింటినీ ఈ పరిశోధకులు ‘జామా పీడియాట్రిక్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. -
మన ఇంట్లోనే పౌష్టికాహారం
ఎంతో రుచి.. అదనపు శక్తి చిన్నారుల కోసం తయారు చేసుకుందాం ఇలా.. తిరుపతి, గాంధీరోడ్డు: అబ్బో ఆ పిల్లాడు చూడు.. ఎంత బొద్దు గా ఉన్నాడో.! ఆ పాప చూడు అచ్చం బొమ్మలా ఉంది. వాళ్లకేంటే..! వాళ్లంతా ఫారెక్స్, ఫీడయిస్యూర్ లాంటివన్నీ పెడుతుంటారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే అక్కడి ఆహారాన్ని పిల్లల కోసం తెప్పించుకొంటారు.. సాధారణంగా మధ్య తరగతి ఇళ్లల్లో తల్లులు ఒకరితో ఒకరు చెప్పుకునే మాటలివి. పిల్లల ఆహార విషయంలో తల్లులు చేస్తున్న తప్పు ఇదే. ఇంట్లో ఉండే పౌష్టికాహారాన్ని వదిలిపెట్టి కొనిపెట్టే వాటి వైపు చూస్తున్నారు. ముందుగా ఇలాంటి తల్లులు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు. ఇంట్లో లభించే పదార్ధాలతోనే చిన్నారులను బొద్దుగా కాదు.. బలంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నారు. పిల్లలు ఒక వయస్సు వరకే తల్లులు చెప్పిన ఆహారాన్ని తీసుకుంటారు. ఎదిగే కొద్ది తమ ఇష్టాలను వ్యక్తం చేస్తుంటారు. ఎంతో మారాం చేస్తుం టారు. అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిపాలు ఎంతో ముఖ్యమని, ఆరు నెలలు దాటిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఆహారాన్ని అందించాలని అంటున్నారు. తల్లిపాలు రెండేళ్ల వరకు ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవారికి మొదటి పౌష్టికాహారమని, తరువాత ఇంట్లో తయారు చేసి అందించే పదార్ధాలు వారికి అదనపు శక్తిని సమకూరుస్తాయని చెబుతున్నారు. అతి తక్కువ సమయంలో ఈ పౌష్టికాహారాన్ని తయారు చేసుకునే విధానాలను వివరించారు. గోధుమ రవ్వతో కిచిడి డాల్డా వేడిచేసి జీలకర్ర, పచ్చిమిర్చి ఆవాలు తాళింపు పెట్టుకోవాలి. అందులో నీరుపోసి, పెసరపప్పు వేసి ఉడికించాలి. చివరగా కడిగి సన్నగా తరిగిన ఆకు కూరను కలుపుకోవచ్చు. కొన్ని నిమిషాలు ఉడికించి నీరు మొత్తం పోయాక పిల్లలకు వడ్డించుకోవచ్చు. గోధుమ పాయసం గోదుమ రవ్వ, పెసరపప్పును కలుపుకోవాలి. నీటిలో కడిగి 5 నుంచి 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మరిగించి రవ్వ పప్పు మిశ్రమాన్ని మెత్తగా ఉడికించాలి. ఇందులో బెల్లం, డాల్డా వేసి బెల్లం కరిగేంత వకు ఉంచి చివరలో యాలకల పొడి వేసి గోధుమ పాయసం తయారు చేసుకోవచ్చు. గోధుమ శనగపిండి లడ్డు గోధుమ, శనగపిండిని కలిపి దోరగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా సరిపడా నీటితో తయారు చేసిన బెల్లం పాకాన్ని వేసుకోవాలి. కలిపే సమయంలో కాసింత నెయ్యి వేస్తే సువాసనతో పాటు, రుచి పిల్లలను ఆకట్టుకుంటుంది. రాగి లడ్డు రాగిపిండిని 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. వేరుసెనగలను వేయించి పైపొట్టు తీసి పొడి చేసుకోవాలి. బెల్లంను తీగ పాకంలా తయారు చేసుకోవాలి. బెల్లం పాకంలో ఉడికించిన రాగిపిండి, వేరుసెనగ గింజల పొడి, నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇష్టమైన ఆకృతిలో అందించవచ్చు. తీపి పొంగల్ పెసరపప్పును దోరగా వేయించి బియ్యంతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మరిగించి ఆ మిశ్రమా న్ని అందులో వేసి మెత్తపడే వరకు ఉడికిం చాలి. రుచికోసం కొద్దిగా ఉప్పు, పొడిగా చేసిన బెల్లం, నెయ్యి సైతం కలుపుకోవచ్చు. బెల్లం కరిగి ఉడికించి తీపి పొంగలిని పిల్లలకు వేడివేడిగా పెట్టుకోవచ్చు. తల్లులు సమతుల్యత పాటించాలి పిల్లలకు పౌష్టికాహారం ఎంతో మేలైనది. తల్లులు ఈ విషయంలో సమతుల్యత పాటించాలి. తల్లిపాలు మాన్పించిన అనంతరం ఇంట్లో లభించే పదార్ధాలతోనే ఈ ఆహారాన్ని అందించవచ్చు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుం ది. అన్నిరకాల పోషకాలు చిన్నారులకు అందేలా చూడాల్సిన బాధ్యత తల్లులదే. - డాక్టర్ మునిశేఖర్, చిన్నపిల్లల డాక్టర్, వైష్టవి హాస్పిటల్, తిరుపతి మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి పుట్టిన బిడ్డకు తల్లి పాలివ్వడం ఒక పౌష్టికాహార పద్దతి అయితే ఆరు నెలలు తరువాత నుంచి ఇచ్చే ఆహారం విషయం లో తీసుకునే జాగ్రత్త మరో పద్దతిని చెబుతున్నారు డాక్టర్ మాధవి. పిల్లలకు ఒకే ఆహారాన్ని విభిన్న రకాలుగా అందించాలి. వారు ఘన పదార్థంగా తినడానికి ఇష్టపడుతున్నారా? లేక ద్రవ ఆహారంలాగానా అనే విషయాన్ని గుర్తించి అందించాలి. - డాక్టర్ నక్కినపల్లి మాధవి, గైనకాలజిస్ట్, గోపీమాధవి హాస్పిటల్ -
తల్లిపాలు ఔషధంతో సమానం
శ్రీకాకుళం అర్బన్: తల్లిపాలు బిడ్డకు ఔషధంతో సమానమని జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రసవమైన అరగంట తరువాత బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చునని, ఈ విషయాన్ని మండల, గ్రామీణ స్థాయిలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు విస్తృతంగా ప్రాచారం చేయాలన్నారు. గర్భిణులు ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం సక్రమంగా అందేటట్లు చూడాలన్నారు. శ్రీకాకుళంఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ తల్లిపాల అవశ్యకతపై ప్రచారం చేయాల్ని బాధ్యత ఐసీడీఎస్ సిబ్బందిపై ఉందన్నారు. రిమ్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంట నుంచే తల్లిపాలు పట్లాలన్నారు. తల్లి పాలలో కొలెస్ట్రమ్ ఉంటుందని, ఈ పాలు పట్టించడం ద్వారా బిడ్డలకు ఎటువంటి రోగాలు దరి చేరవన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పథక సంచాలకుడు డి.చక్రధరరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సీహెచ్.మహలక్ష్మి, జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ, అంగన్వాడీ సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
తల్లి పాలతోనే ఆరోగ్యం
వేలూరు: పురిటి బిడ్డలకు తల్లిపాలతోనే ఆరోగ్యమని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి పురిటి బిడ్డలకు పిల్లలకు ఆరు నెలల వరకైనా తల్లిపాలను ఇవ్వాలని డాక్టర్లు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లి పాలతో చిన్నారులు మంచి పౌష్టికశక్తితో పాటు ఆరోగ్యంగాను ఉంటారన్నారు. ప్రస్తుతం కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్లడంతో చిన్నారులకు తల్లి పాలను ఇవ్వడంతో కాస్త ఇబ్బందులున్నాయన్నారు. కొంత మంది తల్లులు తల్లి పాలు ఇవ్వడం ద్వారా అందం చెడిపోతుందని పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అటువంటి భ్రమలన్నీ వదిలి పెట్టాలన్నారు. తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం అన్నారు. దేశంలో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య తగ్గుతుందని వీటిపై ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన అరగంటలోనే తల్లి ముర్రుపాలను ఇవ్వడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. అనంతరం తల్లి పాలు ఇవ్వడంపై మెడికల్ కళాశాల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి డీన్ సిద్ధతియా మున్వర్, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పూంగొ డి, ప్రిన్సిపాల్ భాస్కర్, పెన్నాతూర్ సర్పంచ్ అరుల్దాసన్, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కలె క్టర్ కారును అడ్డుకున్న రోగులు తల్లిపాల వారోత్సవాలను ముగించుకొని వస్తున్న కలెక్టర్ కారును ప్రసవ వార్డులోని రోగులు అడ్డుకుని నిరసన తెలిపారు. తమ వార్డులో తాగునీరు, మరుగుదొడ్లలో నీరు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.