మన ఇంట్లోనే పౌష్టికాహారం | Our home nutrition | Sakshi
Sakshi News home page

మన ఇంట్లోనే పౌష్టికాహారం

Published Sat, Aug 16 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

మన ఇంట్లోనే పౌష్టికాహారం

మన ఇంట్లోనే పౌష్టికాహారం

  •       ఎంతో రుచి.. అదనపు శక్తి
  •      చిన్నారుల కోసం తయారు చేసుకుందాం ఇలా..
  • తిరుపతి, గాంధీరోడ్డు: అబ్బో ఆ పిల్లాడు చూడు.. ఎంత బొద్దు గా ఉన్నాడో.! ఆ పాప చూడు అచ్చం బొమ్మలా ఉంది. వాళ్లకేంటే..! వాళ్లంతా ఫారెక్స్, ఫీడయిస్యూర్ లాంటివన్నీ పెడుతుంటారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తుంటే అక్కడి ఆహారాన్ని పిల్లల కోసం తెప్పించుకొంటారు.. సాధారణంగా మధ్య తరగతి ఇళ్లల్లో తల్లులు ఒకరితో ఒకరు చెప్పుకునే మాటలివి. పిల్లల ఆహార విషయంలో తల్లులు చేస్తున్న తప్పు ఇదే.

    ఇంట్లో ఉండే పౌష్టికాహారాన్ని వదిలిపెట్టి కొనిపెట్టే వాటి వైపు చూస్తున్నారు. ముందుగా ఇలాంటి తల్లులు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు. ఇంట్లో లభించే పదార్ధాలతోనే చిన్నారులను బొద్దుగా కాదు.. బలంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నారు. పిల్లలు ఒక వయస్సు వరకే తల్లులు చెప్పిన ఆహారాన్ని తీసుకుంటారు. ఎదిగే కొద్ది తమ ఇష్టాలను వ్యక్తం చేస్తుంటారు. ఎంతో మారాం చేస్తుం టారు.

    అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిపాలు ఎంతో ముఖ్యమని, ఆరు నెలలు దాటిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఆహారాన్ని అందించాలని అంటున్నారు. తల్లిపాలు రెండేళ్ల వరకు ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవారికి మొదటి పౌష్టికాహారమని, తరువాత ఇంట్లో తయారు చేసి అందించే పదార్ధాలు వారికి అదనపు శక్తిని సమకూరుస్తాయని చెబుతున్నారు. అతి తక్కువ సమయంలో ఈ పౌష్టికాహారాన్ని తయారు చేసుకునే విధానాలను వివరించారు.
     
     గోధుమ రవ్వతో కిచిడి
     డాల్డా వేడిచేసి జీలకర్ర, పచ్చిమిర్చి ఆవాలు తాళింపు పెట్టుకోవాలి. అందులో నీరుపోసి,     పెసరపప్పు వేసి ఉడికించాలి. చివరగా కడిగి సన్నగా తరిగిన ఆకు కూరను కలుపుకోవచ్చు. కొన్ని నిమిషాలు ఉడికించి     నీరు మొత్తం పోయాక పిల్లలకు వడ్డించుకోవచ్చు.
     
     గోధుమ పాయసం
     గోదుమ రవ్వ, పెసరపప్పును కలుపుకోవాలి. నీటిలో కడిగి 5 నుంచి 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మరిగించి రవ్వ పప్పు మిశ్రమాన్ని మెత్తగా ఉడికించాలి. ఇందులో బెల్లం, డాల్డా వేసి బెల్లం కరిగేంత వకు ఉంచి చివరలో యాలకల పొడి వేసి గోధుమ పాయసం తయారు చేసుకోవచ్చు.
     
     గోధుమ శనగపిండి లడ్డు
     గోధుమ, శనగపిండిని కలిపి దోరగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా సరిపడా నీటితో తయారు చేసిన బెల్లం పాకాన్ని వేసుకోవాలి. కలిపే సమయంలో కాసింత నెయ్యి వేస్తే సువాసనతో పాటు, రుచి పిల్లలను ఆకట్టుకుంటుంది.
     
     రాగి లడ్డు
     రాగిపిండిని 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. వేరుసెనగలను వేయించి పైపొట్టు తీసి పొడి చేసుకోవాలి. బెల్లంను తీగ పాకంలా తయారు చేసుకోవాలి. బెల్లం పాకంలో ఉడికించిన రాగిపిండి, వేరుసెనగ గింజల పొడి, నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇష్టమైన ఆకృతిలో అందించవచ్చు.
     
     తీపి పొంగల్
     పెసరపప్పును దోరగా వేయించి బియ్యంతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మరిగించి ఆ మిశ్రమా న్ని అందులో వేసి మెత్తపడే వరకు ఉడికిం చాలి. రుచికోసం కొద్దిగా ఉప్పు, పొడిగా చేసిన బెల్లం, నెయ్యి సైతం కలుపుకోవచ్చు. బెల్లం కరిగి ఉడికించి తీపి పొంగలిని పిల్లలకు వేడివేడిగా పెట్టుకోవచ్చు.
     
     తల్లులు సమతుల్యత పాటించాలి
     పిల్లలకు పౌష్టికాహారం ఎంతో మేలైనది. తల్లులు ఈ విషయంలో సమతుల్యత పాటించాలి. తల్లిపాలు మాన్పించిన అనంతరం ఇంట్లో లభించే పదార్ధాలతోనే ఈ ఆహారాన్ని అందించవచ్చు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుం ది. అన్నిరకాల పోషకాలు చిన్నారులకు అందేలా చూడాల్సిన బాధ్యత తల్లులదే.
     - డాక్టర్ మునిశేఖర్, చిన్నపిల్లల డాక్టర్, వైష్టవి హాస్పిటల్, తిరుపతి
     
     మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి
     పుట్టిన బిడ్డకు తల్లి పాలివ్వడం ఒక పౌష్టికాహార పద్దతి అయితే ఆరు నెలలు తరువాత నుంచి ఇచ్చే ఆహారం విషయం లో తీసుకునే జాగ్రత్త మరో పద్దతిని చెబుతున్నారు డాక్టర్ మాధవి. పిల్లలకు ఒకే ఆహారాన్ని విభిన్న రకాలుగా అందించాలి. వారు ఘన పదార్థంగా తినడానికి ఇష్టపడుతున్నారా? లేక ద్రవ ఆహారంలాగానా అనే విషయాన్ని గుర్తించి అందించాలి.
     - డాక్టర్ నక్కినపల్లి మాధవి, గైనకాలజిస్ట్, గోపీమాధవి హాస్పిటల్
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement