శ్రీకాకుళం అర్బన్: తల్లిపాలు బిడ్డకు ఔషధంతో సమానమని జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రసవమైన అరగంట తరువాత బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చునని, ఈ విషయాన్ని మండల, గ్రామీణ స్థాయిలో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు విస్తృతంగా ప్రాచారం చేయాలన్నారు. గర్భిణులు ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం సక్రమంగా అందేటట్లు చూడాలన్నారు.
శ్రీకాకుళంఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ తల్లిపాల అవశ్యకతపై ప్రచారం చేయాల్ని బాధ్యత ఐసీడీఎస్ సిబ్బందిపై ఉందన్నారు. రిమ్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంట నుంచే తల్లిపాలు పట్లాలన్నారు. తల్లి పాలలో కొలెస్ట్రమ్ ఉంటుందని, ఈ పాలు పట్టించడం ద్వారా బిడ్డలకు ఎటువంటి రోగాలు దరి చేరవన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పథక సంచాలకుడు డి.చక్రధరరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సీహెచ్.మహలక్ష్మి, జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ, అంగన్‌వాడీ సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
తల్లిపాలు ఔషధంతో సమానం
Published Thu, Aug 7 2014 2:35 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
Advertisement