బిహార్‌పై ప్రతికూల ప్రభావం
⇒ బీజేపీతో నితీశ్ కటీఫ్‌పై పీపీఆర్సీ మనోగతం
⇒ నితీశ్ హయాంలో ఆర్థిక పురోగతి అంతంతే
⇒ తగ్గిన టాయిలెట్ల నిర్మాణం
⇒ బడికి స్వస్తి పలికిన బాలికలు
⇒ పెరగని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
⇒ పడకేసిన వైద్యరంగం
న్యూఢిల్లీ: బీజేపీ-జేడీయూ చీలిక.. బిహార్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని కాషాయకూటమికి చెందిన మేథావి వర్గం అభిప్రాయపడింది. తన హయాంలో బిహార్ ప్రగతి బాటన నడిచిందంటూ నితీశ్ ప్రచారం చేసుకోవడం అసత్యమని పేర్కొంది. ఎన్డీయేని తోసిరాజని వెళ్లిపోయిన కారణంగా పరిపానలలో నాణ్యత లోపించిందని బీజేపీ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుధే నేతృత్వంలోని పబ్లిక్ పాలసీ రీసెర్చి సెంటర్ (పీపీఆర్‌సీ) కమిటీ అభిప్రాయపడింది. ఇది బిహార్‌వాసుల మనుగడపై ప్రభావం చూపిందంది. నితీశ్ బయటికెళ్లిపోయాక బిహార్‌లో అభివృద్ధి పనులు దెబ్బతిన్నాయంది. 2013లో బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టడంతో నితీశ్... ఎన్డీయే కూటమినుంచి విడిపోయిన సంగతి విదితమే. 2012-13 మధ్యకాలంలో బిహార్ ఆర్థిక పురోగతి 15 నుంచి తొమ్మిది శాతానికి పడిపోయిందని పీపీఆర్‌సీ పేర్కొంది.
కేవలం 70 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే బాలలకు, 58 శాతం పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు ఉన్నాయంది. బాలికలు మధ్యలోనే బడి మానేయడానికి ఇదే ప్రధాన కారణమంది. 2011-12లో 22,575, 2012-13లో 17,009 మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించింది. 2013-14 మధ్యకాలంలో ఈ సంఖ్య 5,076కు పడిపోయింది. ఇక శిశు మరణాలు జాతీయ సగటు వెయ్యికి 40 కాగా బిహార్‌లో అది 42 శాతంగా ఉంది. ఇందుకు కారణం వైద్యరంగానికున్న పరిమితులేనని పీపీఆర్‌సీ సభ్యుడైన ఉజ్వల్ పేర్కొన్నారు. 2009లో బిహార్‌లో 533 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయని, 2014వరకూ వాటి సంఖ్య అలాగే ఉందని, ఇది జాతీయ సగటుతో పోలిస్తే తక్కువని అన్నారు.
రహదార్ల నిర్మాణమూ అంతంతే
నితీశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రహ దార్ల నిర్మాణం అంతంతగానే జరిగిందని పీపీఆర్‌సీ తన నివేదికలో పేర్కొంది. ఏయేటికాయేడు తగ్గుముఖం పట్టిందం ది. 2006-07లో 337 కిలోమీటర్ల మేర కొత్త రహదార్లను నిర్మించారని, అయితే రెండు పార్టీలు కలిసి ఉన్న సమయంలో 38.35 కి.మీ మేర కొత్త రోడ్ల నిర్మాణం జరిగింద ంది. 2013-14 మధ్యకాలంలో కేవలం 192 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మించారని పేర్కొంది.