పాట్నా: రెండేళ్ల క్రితం రాష్ట్రంలో మద్యపాన నిషేదం చేసి సంచలన నిర్ణయం తీసుకున్న బిహార్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖైనీ నిషేదం దిశగా నితీష్ ప్రభుత్వం ముందడుగేసింది. దానికనుగుణంగా పొగాకు ఆధారిత ఉత్పత్తులను ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పరిధిలోకి తీసుకరావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ఆరోగ్యశాఖ అధికారి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఖైనీ నిషేదించాలంటే చట్టప్రకారం ఆ ఉత్పత్తి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిధిలోనిదై ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాశామని సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.
‘బిహార్‌లోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఖైనీ, పొగాకు ఉత్పత్తుల బారిన పడుతున్నారు. గత ఏడేళ్లలో పొగాకుకు బానిసలయిన వారి శాతం 53 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. అయినా ఇప్పటికీ పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్న వారి సంఖ్య ఆంధోళనకరంగానే ఉంది. ఇది ఏమాత్రం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఖైనీ ఉత్పత్తులను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిధిలోకి తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాము. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగానే బిహార్‌లో సంపూర్ణంగా ఖైనీ నిషేధిస్తాము’ అని సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment