మాంఝీ పార్టీకి 20 సీట్ల కేటాయింపు
న్యూఢిల్లీ : ఎన్డీఏలో సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన తొలగింది. బిహార్ ఎన్నికల్లో బీజేపీ హెచ్ఏఎం మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల సీట్ల మధ్య సర్దుబాటుపై చర్చలు సఫలం అయ్యాయి. హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీ ఒత్తిడికి బీజేపీ తలొగ్గింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా మాంఝీ పార్టీకి 20 సీట్లు కేటాయించింది.
ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారమిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. బిహార్ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఫలితాల తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 160 సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది. కాగా బీజేపీ ....హెచ్‌ఏఎంకు-20,ఎల్జేడీకి-40, ఆర్ఎస్ఎస్పీకి-23 సీట్లు కేటాయించింది.