'వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు' | Biology paper easy, but lengthy, say students | Sakshi
Sakshi News home page

'వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు'

Published Tue, Mar 22 2016 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

'వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు'

'వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు'

న్యూఢిల్లీ: బయాలజీ పేపర్ ఈజీగా వచ్చిందని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా  సీబీఎస్ఈ 12వ తరగతి బయాలజీ పరీక్ష సోమవారం జరిగింది. పేపర్ విస్తృతంగా, అప్లికేషన్ బేస్డ్ గా ఉందని వెల్లడించారు. పేపర్ సులువుగానే ఉందని, డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చాయని చెప్పారు. బాగా చదివిన వారు వందకు వంద మార్కులు సాధించే అవకాశముందని టీచర్లు పేర్కొన్నారు. ఎకౌంటెన్సీ పేపర్ కూడా ఈజీగానే వచ్చిందని కొంత మంది విద్యార్థులు తెలిపారు.

అంతకుముందు రాసిన మ్యాథమేటిక్స్ పేపర్ కఠినంగా ఉండడంతో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్ఈకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మొరపెట్టుకున్నారు. విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఎస్ఈ తగిన చర్యలు చేపడతామని హామీయిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement