
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ బరిలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో దాదాపు సగం మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల్లో బీజేపీ 48 శాతం మంది నేర చరితులకు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్ 44 శాతం మంది క్రిమినల్ కేసులు నమోదైన వారిని అభ్యర్ధులుగా బరిలో దింపింది.
ఇక ఆరో విడత పోలింగ్ బరిలో నిలిచిన 967 మంది అభ్యర్ధుల్లో 20 శాతం మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషణలో వెల్లడైంది. ఇక 54 మంది బీజేపీ అభ్యర్ధుల్లో 26 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, 46 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 20 మంది నేరచరితులే కావడం గమనార్హం. బీఎస్పీ తరపున బరిలో ఉన్న 49 మంది అభ్యర్ధుల్లో 19 మందిపై, 307 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో 34 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment