
న్యూఢిల్లీ : స్వైన్ ఫ్లూ చికిత్స కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి దయ, మీ అందరి ఆశీర్వాందంతో త్వరలోనే కోలుకుంటా’ అని అమిత్ షా హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఛాతీ పట్టేయడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర కారణాలతో అమిత్ షాను ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అమిత్ షాను ఆసుపత్రిలో పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment