ఢిల్లీ:భూసేకరణ ఆర్డినెన్స్ పై నరేంద్ర మోదీ ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఆర్డినెన్స్ ను తయారుచేశారని ఆయన మండిపడ్డారు. బలవంతంగా భూసేకరణ చేస్తే వైబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని జైరాం రమేష్ తెలిపారు. అసలు భూసేకరణ ఆర్డినెన్స్ పై చర్చకు సిద్ధమంటున్న బీజేపీ ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్స్ ను తేవడంపై మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఆదివారం నాటి కాంగ్రెస్ ర్యాలీలో రైతుల సమస్యలపై తమ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు, రాహుల్ గాంధీలు మాట్లాడనున్నారని దిగ్విజయ్ తెలిపారు.