సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి మరో రెండేళ్లలో కఠిన పరీక్ష ఎదురుకాబోతుంది. సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులపై కేంద్రం దృష్టిసారించింది. ఢిల్లీ నుంచి పాట్నకు రహదారి మార్గంలో ప్రయాణ సమయాన్ని 11 గంటలకు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించింది. కేంద్రప్రభుత్వం, బిహార్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ఈ ప్రయాణ సమయాన్ని కనీసం మూడింట తగ్గించేయాలని నిర్ణయించాయి. ఈ ప్లాన్‌లో భాగంగా రింగ్ రోడ్డులు, ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించనున్నాయి. ఢిల్లీ, లక్నో, పాట్నలు కేంద్ర ప్రభుత్వానికి మూడు మేజర్ పొలిటకల్ సెంటర్లు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర ప్రదేశ్, బిహార్‌లు కీలక రాష్ట్రాలుగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా.. బిహార్‌లో జేడీయూకు మద్దతుగా బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల్లో అస్తవ్యస్థంగా ఉన్న రోడ్డు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించేందుకు సిద్దమైంది. ఢిల్లీ నుంచి ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు కొత్త ఎకనామిక్ కారిడార్‌ను ఏర్పాటుచేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నకు రోడ్డు మార్గాన 18 గంటల సమయం పడుతోంది.
ఢిల్లీ నుంచి పాట్నకు ప్రయాణ సమయాన్ని 11 గంటలకు తగ్గించాలనుకోవడం చాలా పాజిటివ్ నిర్ణయమని, రింగ్ రోడ్డులు, ఎక్స్‌ప్రెస్‌హైవేలు నిర్మించాక, ఎక్స్‌ప్రెస్‌హైవేలు ఎక్కువ ట్రాఫిక్‌ను ఆకట్టుకుంటాయని యూపీ ఎక్స్‌ప్రెస్‌హైవేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో అవనిష్ కే అవస్థి చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆగ్రా టూ లక్నో మధ్య జర్నీ సమయాన్ని తగ్గించడం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించిందని తెలిపారు. ఆగ్రా నుంచి లక్నోకు నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌హైవే మంచి ట్రాఫిక్‌ను కలిగి ఉందని, దివాళి సందర్బంగా 32వేలకు పైగా కార్లు, చిన్న వాహానాలు ఈ హైవేపై ప్రయాణించినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment