సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశం కానుంది. హోంమంత్రి అమిత్ షా సహా పార్టీకి చెందిన ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరు కావచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుండటం గమనార్హం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా ఎన్నికైన అనంతరం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇదే తొలిసారి.
పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభంకానుంది. జులై 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగుతున్న ఎన్నికల అనంతర హింసాకాండ తదితర అంశాలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment