బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
Published Thu, Oct 27 2016 5:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఉప ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల వివరాలను బీజేపీ ప్రకటించింది. వీళ్ల పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి..
మధ్యప్రదేశ్:
షాదోల్ (ఎస్టీ) పార్లమెంటరీ నియోజవర్గం నుంచి జ్ఞాన్ సింగ్, నేపానగర్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి మంజు దాడు
తమిళనాడు:
అరవకురిచి అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎస్.ప్రభు, తంజావూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎంఎస్ రామలింగం, తిరుపరంకుంద్రం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసన్
పశ్చిమబెంగాల్:
కూచ్‌బీహార్ (ఎస్సీ) పార్లమెంటు నియోజవర్గం నుంచి హేమ చంద్ర బర్మన్, తమ్లుక్ పార్లమెంటు నియోజవర్గం నుంచి ప్రొఫెసర్ అంబుజ్ మొహంతి, మాంటేశ్వర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బిశ్వజిత్ పొద్దార్
త్రిపుర:
బర్జలా అసెంబ్లీ నియోజవర్గం నుంచి శిష్ట మోహన్ దాస్, ఖొవాయ్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి తపన్ కుమార్ పాల్
అరుణాచల్ ప్రదేశ్:
హేయులియాంగ్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి దసంగ్లు పుల్
అసోం:
లఖింపూర్ పార్లమెంటు నియోజవర్గం నుంచి ప్రధాన్ బారువా, బైతాలంగాసో (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి డాక్టర్ మాన్ సింగ్ రోంగ్‌పి
Advertisement
Advertisement