కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి జై శ్రీరాం నినాదాలతో కూడిన పది లక్షల పోస్టు కార్డులను పంపాలని నిర్ణయించామని బెంగాల్‌లోని బరక్‌పోర్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు. జై శ్రీరాం అని రాసిఉన్న లక్షలాది పోస్టు కార్డులను ముఖ్యమంత్రి నివాసానికి పంపుతామని చెప్పారు. తృణమూల్ ఎమ్మెల్యే అయిన సింగ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు.
జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున జైశ్రీరాంనినాదాలతో కూడిన పోస్టు కార్డులను పంపాలని పార్టీ నిర్ణయించిందని సింగ్ చెప్పారు. కాగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 42 స్ధానాలకు గాను బీజేపీ తొలిసారిగా 18 స్ధానాల్లో గెలుపొంది పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ కాన్వాయ్ ఎదుట బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించడం పట్ల దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment