
స్కూటీపై హిమాలయాలకు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి ఎత్తై హిమాలయాలను మహిళలు స్కూటీపై అధిరోహించారు. 10 మంది మహిళలు 18,340 అడుగుల ఎత్తున్న లడక్‌లోని ఖార్దుంగ్ లా పర్వతాలను ఎక్కారు. ‘టీవీఎస్ హిమాలయన్ హైస్’ రెండో సీజన్‌లో భాగంగా దీనిని నిర్వహించారు. గతేడాది రైడింగ్‌లో పాల్గొన్న అనమ్ హశీం నేతృత్యంలో ఈ యాత్ర సాగింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఆగస్టు 11న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 21తో ముగిసింది. ఇలాంటి సాహసాలకు శారీరక బలం కన్నా మానసిక స్థైర్యం చాలా ముఖ్యమని అనమ్ తెలిపారు. ప్రతికూల వాతావరణం సహా పలు అడ్డంకులు ఎదురయ్యాయని, వాటన్నింటిని అధిగమించి యాత్రను పూర్తి చేశామన్నారు.