ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా? | Building Pollution city like Delhi ? | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?

Published Wed, Nov 9 2016 2:33 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?

ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?

- రాష్ట్ర పర్యావరణ అనుమతులు చెల్లవన్న పిటిషనర్ల న్యాయవాది
- ఎన్జీటీలో ‘అమరావతి’పై విచారణ
 
 సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మిస్తున్నారా? అని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ‘అమరావతి’పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రిత్విక్‌దత్తా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. కేవలం రాష్ట్ర స్థారుు పర్యావరణ అంచనా అథారిటీ ఇచ్చిన అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని దత్తా తెలిపారు. ‘ఏ’ క్యాటగిరీ కింద ఉన్న నిర్మాణాలు చేపట్టేటప్పుడు రాష్ట్ర స్థారుు పర్యావరణ అనుమతులు చెల్లవని, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకే రోజు 70 రకాల పర్యావరణ అనుమతులను రాష్ట్ర స్థారుులోనే మంజూరు చేశారని,  సమగ్ర అధ్యయనం లేకుండా ఒకేరోజు అన్ని అనుమతులు ఇచ్చారని ఆయన వివరించారు. పైగా ఈ కమిటీలో నిపుణులు ఎవరూ లేరన్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతం కాలుష్యం బారిన పడిందని, ఈ విషయాన్ని ఈఐఏ తన నివేదికలో పేర్కొందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో వెరుు్య హెక్టార్లకుపైబడి పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీనికి సంబంధించిన అనుమతులను కూడా రాష్ట్ర స్థారుులోనే పొందారని చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఢిల్లీని నిర్మించనున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం ధర్మాసనం విచారణను బుధవారానికి వారుుదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement