Central Department of Environment
-
చిరుత నవ్వింది!
చిరుతలు దుమ్ము రేపుతున్నాయి. దేశమంతటా యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వాటి సంఖ్య బాగా పెరిగింది. కాకపోతే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో చిరుతలు తగ్గుతుండటం కాస్త కలవరపెట్టే అంశమేనని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. 2018లో భారత్‌లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ‘భారత్‌లో చిరుతల స్థితిగతులు–2022’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్టు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రం చిరుతల సంఖ్యలో గత నాలుగేళ్లలో తగ్గుదలే నమోదైంది. ఆవాస ప్రాంతాలతో పాటు ఆహార లభ్యత కూడా తగ్గిపోవడం, చిరుతల వేట విచ్చలవిడిగా పెరగడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ‘‘ఫలితంగా చిరుతలు నివాస ప్రాంతాలపైకి వచి్చపడుతున్నాయి. దాంతో జనం వాటిని హతమారుస్తున్నారు. ఈ ధోరణి కొంతకాలంగా పెరుగుతుండటం ఆందోళనకరం’’ అని నివేదిక ఆవేదన వెలిబుచి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చిరుతల సంఖ్య కాస్తో కూస్తో స్థిరంగానే కొనసాగినట్టు తెలిపింది. మొత్తమ్మీద వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని సర్వే వెలుగులోకి తెచి్చందని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల భారతీయుల సహన ధోరణి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్ చౌబే అభిప్రాయపడ్డారు. సంఖ్య పెరిగినా... ► గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1,022 చిరుతలు పెరిగాయి. ► మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెరుగుదల నమోదైంది. ► శాతాలపరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్ టాప్‌లో నిలిచింది. ► కానీ తెలంగాణతో పాటు గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో చిరుతల సంఖ్య తగ్గింది. ► ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు, అంటే 192 చిరుతలు తగ్గాయి. సర్వే ఇలా... ► దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే జరిపారు. ► ఇందుకు ఏకంగా 6.4 లక్షల పనిదినాలు పట్టింది! దీన్ని ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వణ్యప్రాణి సర్వేగా కేంద్రం అభివరి్ణంచింది. ► చిరుతలను గుర్తించేందుకు 32,803 వ్యూహాత్మక స్థానాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. ► అలా సమకూరిన 4 కోట్ల పై చిలుకు ఫొటోలను విశ్లేíÙంచారు. వాటిలో చిరుతలకు సంబంధించిన 85 వేల ఫొటోలను గుర్తించారు. ► తద్వారా చిరుతల మొత్తం సంఖ్యను 13,874గా నిర్ధారించారు ► అయితే సర్వేలో దేశంలోని చిరుతల ఆవాస ప్రాంతాల్లో 70 శాతాన్ని మాత్రమే కవర్ చేయగలిగినట్టు కేంద్రం పేర్కొంది. ► హిమాలయాలు, అటవేతర ఆవాసాలు, మెట్ట ప్రాంతాలను సర్వే పరిధి నుంచి మినహాయించారు. ► ఆ లెక్కన భారత్‌లో చిరుతల వాస్తవ సంఖ్య 13,874 కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది. విశేషాలు ఇవీ... మధ్య భారతంతో పాటు తూర్పు కనుమల్లో నాలుగేళ్లలో చిరుతలు 8,071 నుంచి 8,820కి పెరిగాయి. అంటే 1.5 శాతం పెరుగుదల నమోదైంది. పశి్చమ కనుమల్లో 3,387 నుంచి 3,596కు పెరిగాయి. ఈశాన్య కొండప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాల్లోనూ అవి 141 నుంచి 349కి పెరిగాయి. 2018లో శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో మాత్రం చిరుతలు 1,253 నుంచి 1,109కి, అంటే 3.4 శాతం తగ్గాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ అటవీ డివిజన్లో గత నాలుగేళ్లలో చిరుతలు తగ్గగా పులుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం! – సాక్షి, నేషనల్‌డెస్క్ -
అక్టోబర్ కల్లా అనుమతులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సాధన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను, ఇతర అంశాలను మరో వారం, పదిరోజుల్లో కేంద్ర పర్యావరణ శాఖకు నివేదించనుంది. ఎన్జీటీలో కేసులు, కేంద్రం, బోర్డుల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైన అనుమతులు సాధించే ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అక్టోబర్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం ఇప్పటికే సజావుగా ముగించిన సంగతి తెలిసిందే. ఈఏసీకి సమర్పించే నివేదికలపై కసరత్తు ఈ ప్రాజెక్టు కోసం 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు కూడా అవసరం కానున్నాయి. ఇప్పటివరకు 26 వేల ఎకరాల భూసేకరణ పూర్తికాగా, ఈ నెల 10న ఐదు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. దీంతో ఈ వివరాలతో పాటు జీవ వైవిధ్య నిర్వహణ ప్రణాళిక, మత్స్య సంపద పరిరక్షణ, నిర్వహణ, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, పునరావాసం పునర్నిర్మాణం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, క్వారీల పునరుద్ధరణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు సమర్పించనున్నారు. జల, వాయు, శబ్ద నిర్వహణ ప్రణాళికలు, ప్రజారోగ్యం, పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, స్థానిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు తదితరాలపై వివరాలతో పాటు, వాటిపై వెచ్చించే నిధులపై కేంద్రానికి వివరణ ఇచ్చేలా కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్ శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం అనుభవంతో.. తెలంగాణ తమకు సమర్పించే నివేదికలపై కేంద్ర పర్యావరణ శాఖలోని ప్రాజెక్టుల ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) చర్చించి, ప్రాజెక్టుతో పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. బ్యారేజీలు, కాలువలు, పంపుహౌస్‌ల నిర్మాణంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. వీటి నిర్మాణాలపై ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ స్పష్టం చేస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ సమయంలో ఈఏసీ పలు సూచనలు చేసింది. ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలని చెప్పింది. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ను చేపట్టడంతో పాటు దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. దీంతో పాలమూరుకు అనుమతుల విషయంలో.. ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. -
ఆ రోజు నుంచి ప్లాస్టిక్ ఉండదు
న్యూఢిల్లీ: 2022 జనవరి 1 నుంచి ప్లాస్టిక్ ఉపయోగాన్ని క్రమంగా తగ్గించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కనిపించకుండా చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందిన కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటుకు తెలిపారు. ప్లాస్టిక్ పుల్లలు ఉన్న ఇయర్ బడ్స్, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ పుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, డెకరేషన్ చేసేందుకు ఉపయోగించే పాలీస్టైరిన్‌లు జనవరి 1 నాటికి ఉపయోగించకుండా చూసే ప్రక్రియ సాగుతోందని అన్నారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ,120 మైక్రాన్ల మందం కంటే తక్కవ ఉండే రీసైకిల్డ్ క్యారీ బ్యాగులను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మార్కెట్లో అందుబాటులో లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
కృష్ణమ్మకు అడ్డుకట్ట!
కృష్ణాపై మరో నాలుగు ఎత్తిపోతల పథకాలు చేపట్టిన కర్ణాటక అదనంగా 21 టీఎంసీల వినియోగానికి ప్రణాళిక ఇప్పటికే ఓకే చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ అవి పూర్తయితే రాష్ట్రానికి భారీగా తగ్గిపోనున్న నీటి రాక సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఎగువనే పూర్తిగా బందీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైనుంచి కిందకు నీటి ప్రవాహాలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేందుకు యత్నిస్తోంది. ఇందు లో భాగంగా కొత్త ఎత్తిపోతల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే నాలుగు ఎత్తిపోతల పథకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు అధికారికమైతే దిగువకు 21 టీఎంసీల మేర ప్రవాహాలు తగ్గిపోనుండడం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అవి పూర్తయితే మనకు కష్టమే.. ఇప్పటికే అప్పర్ కృష్ణా ఇరిగేషన్ ప్రాజె క్టు(యూకేఐపీ) కింద కర్ణాటక.. బీజాపూర్, గుల్బర్గా, ఉద్గీర్, భగల్‌కోట్, రాయచూర్ జిల్లాల్లోని 6.22 లక్షల హెక్టార్ల ఎకరాలకు నీరందిస్తోంది. ఈ ఆయకట్టును మరింత విస్తారించాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (కేబీజేఎన్ఎల్) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అప్పర్ కృష్ణాలో బీజాపూర్ జిల్లా బుధిహాల్– పీరాపూర్, రాయిచూర్ జిల్లాల్లోని నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్ వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను రూ.3,710 కోట్లతో చేపట్టాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. వీటికి మొత్తంగా 21 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు వేసింది. వీటిద్వారా 1.29 లక్షల హెక్టార్లకు సాగునీటిని ఇవ్వాలని చూస్తోంది. ఈ ఎత్తిపోతల పథకాల కోసం 2,403 హెక్టార్ల మేర భూసేకరణ అవసరం ఉండగా... కేబీజేఎన్ఎల్ ఇప్పటికే 822 హెక్టార్ల మేర భూసేకరణను పూర్తి చేసింది. తాజాగా పర్యావరణ, అటవీ, ఇతర అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇది తెలంగాణను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు నీటి వినియోగాన్ని మొదలు పెడితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు తగ్గుతాయి. ఇప్పటికే ఎగువన వచ్చిన వరదను వచ్చినట్టే కర్ణాటక పట్టేసుకుంటోంది. కిందకు చుక్క నీటిని వదలకపోవడంతో తెలంగాణ, ఏపీలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గడ్డుకాలం తప్పడం లేదు. ఒకవేళ నీరొచ్చినా ఖరీఫ్ సాగుకు నవం బర్, డిసెంబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి వస్తోంది. అదనంగా మరో 21 టీఎంసీల నీటి వినియోగం మొదలు పెడితే దిగువకు నీటి రాక మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. పోలవరం వాటాల్లోంచేనా? గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం ప్రాజెక్టును చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఉంది. ప్రస్తుతం పోలవరానికి జాతీయ హోదా కట్టబెట్టడంతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కాయి. ఇందులో 14 టీఎంసీలు మహారాష్ట్రకు దక్కనుండగా, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. దీన్ని ఆధారంగా చేసుకొనే కర్ణాటక 4 ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని, అందుకే కేంద్ర పర్యావరణ శాఖ సైతం వెంటనే అనుమతులు జారీ చేసి ఉండవచ్చని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఆ నీటి వాటాలపై ఆధారపడే ఈ ఎత్తిపోతలు చేపట్టారా? లేదా అదనపు నీటి వినియోగమా? అన్న అంశమై సోమవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈఎన్సీ మురళీధర్ హైడ్రాలజీ, అంతరాష్ట్ర వ్యవహారాల విభాగపు అధికారులతో భేటీ నిర్వహించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే తదుపరి ప్రతిస్పందన తెలియ జేయాలని నిర్ణయించారు. ‘కృష్ణా’ నియంత్రణపై వెనక్కి తగ్గని బోర్డు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నియం త్రణలోకి తెచ్చుకునే అంశంపై బోర్డు వెనక్కి తగ్గట్లేదు. ఈ విషయమై గత ముసాయిదా నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభు త్వం అభ్యంతరం చెప్పనందున తమ సిఫార్సులకు సమ్మతిగానే భావిస్తామని పేర్కొంటోంది. బుధవారం జరగనున్న బోర్డు భేటీలో నోటిఫికేషన్ అంశాన్ని ఎజెండాగా చేర్చింది. దీనిని తప్పుబడు తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పని మొదలు పెట్టకముందే కృష్ణా బోర్డు తన ‘ఎజెండా’తో ముందుకు సాగుతుండటం గమనార్హం. ప్రాజెక్టులను నియంత్రణ లోకి తెచ్చుకునేందుకే దీన్ని ఎజెండాలో చేర్చారని తెలంగాణ ప్రభుత్వం అనుమా నిస్తోంది. పారదర్శకంగా నీటి వినియో గం జరిగేందుకు టెలిమెట్రీ పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుండగా మళ్లీ ప్రాజె క్టుల నియంత్రణ అవసరం ఏమిటని వాదిస్తోంది. పులిచింతల ఫోర్‌షోర్ నీటిపై ఆధారపడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఏపీ తీసుకోవాల్సిన చర్యలపైనా లేవనెత్తనుంది. -
పులి మరణంపై కేంద్రం సీరియస్
వన్యప్రాణులకు రక్షణ కరువవ్వడంపై కేంద్ర పర్యావరణ శాఖ ఆగ్రహం సాక్షి, మంచిర్యాల: అడవుల్లో వన్యప్రాణులే లక్ష్యంగా సాగుతున్న మారణకాండను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతుల ముసుగులో పంట పొలాలకు రక్షణ సాకుతో వేటగాళ్లే వన్యప్రాణులను వధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిర్ధారించుకుంది. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు కోటపల్లి మండలంలోని పిన్నారం గ్రామంలో మూడేళ్ల పులి బలైన విషయం ఈనెల 3న వెలుగు చూసింది. అయితే, ఈ సంఘటనపై విచారణకు కేంద్ర అటవీ పర్యావరణ రక్షణ సంస్థ లు సిద్ధమయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు, చెన్నూరు డివిజన్లో నాలుగేళ్లలో 3 పులులు బలైనట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. అలాగే, గత నెల 22న కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూర్ రేంజ్‌లోని ఎట్టిగూడలో ఓ పులి చర్మాన్ని అధికారు లు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే పులిని హతమార్చినట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పులి హతం, విద్యుత్ తీగలు అమర్చడం, గతంలో జరిగిన సంఘటన లన్నింటినీ కలిపి రాష్ట్ర అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టైగర్ కన్స ర్వేటివ్ అథారిటీ (ఎన్టీసీఏ)కి ప్రాథమిక నివేదిక పంపింది. కాగా, ఈ సంఘటనకు బాధ్యుల ను చేస్తూ బీట్ ఆఫీసర్ అంజారి, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ నగేష్‌లను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. -
ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?
-
ఢిల్లీ లాంటి కాలుష్య నగరాన్ని నిర్మిస్తారా?
- రాష్ట్ర పర్యావరణ అనుమతులు చెల్లవన్న పిటిషనర్ల న్యాయవాది - ఎన్జీటీలో ‘అమరావతి’పై విచారణ సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మిస్తున్నారా? అని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ‘అమరావతి’పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రిత్విక్దత్తా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. కేవలం రాష్ట్ర స్థారుు పర్యావరణ అంచనా అథారిటీ ఇచ్చిన అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని దత్తా తెలిపారు. ‘ఏ’ క్యాటగిరీ కింద ఉన్న నిర్మాణాలు చేపట్టేటప్పుడు రాష్ట్ర స్థారుు పర్యావరణ అనుమతులు చెల్లవని, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకే రోజు 70 రకాల పర్యావరణ అనుమతులను రాష్ట్ర స్థారుులోనే మంజూరు చేశారని, సమగ్ర అధ్యయనం లేకుండా ఒకేరోజు అన్ని అనుమతులు ఇచ్చారని ఆయన వివరించారు. పైగా ఈ కమిటీలో నిపుణులు ఎవరూ లేరన్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతం కాలుష్యం బారిన పడిందని, ఈ విషయాన్ని ఈఐఏ తన నివేదికలో పేర్కొందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో వెరుు్య హెక్టార్లకుపైబడి పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీనికి సంబంధించిన అనుమతులను కూడా రాష్ట్ర స్థారుులోనే పొందారని చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఢిల్లీని నిర్మించనున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం ధర్మాసనం విచారణను బుధవారానికి వారుుదా వేసింది. -
జెన్కోపై క్రిమినల్ చర్యలు
పర్యావరణ అనుమతి లేకుండా ‘భద్రాద్రి’ నిర్మాణంపై ఎన్జీటీ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ : పర్యావరణ అనుమతి లేకుండా ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పీసీబీని ఆదేశించింది. వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్‌లతో పాటు పర్యావరణ చట్టం-1989 సెక్షన్లు 15, 16, 17 కింద 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలంది. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి విద్యుత్ కేంద్ర పనులు ప్రారంభించడంపై అభ్యంతరం తెలుపుతూ హ్యూమన్‌రైట్స్ ఫోరం (హెచ్ఆర్ఎఫ్) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న ఎన్జీటీ ఈ మేరకు తీర్పునిచ్చింది. బాధ్యులైన అధికారులపై ఇంతవరకు పీసీబీ (రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి) చర్యలు తీసుకోకపోవడం తమకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించిందని తీర్పులో ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పర్యావరణ చట్ట ఉల్లంఘనల విషయంలో జెన్కో నిర్వహణాధికారు (ఎగ్జిక్యూటివ్)లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు జారీ చేసేవరకు ప్రాజెక్టు నిర్మాణ పనులపై జెన్కో యథాతథా స్థితిని కొనసాగించాలని పేర్కొంది. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను ధ్వంసం చేసేందుకు ఆదేశించాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని ఎన్జీటీ తోసిపుచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావంపై సరైన అధ్యయనం సాధ్యమా? కాదా? అన్న అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒక వేళ జెన్కోకు వ్యతిరేకంగా ఈఏసీ నిర్ణయం వెలువడితే కేంద్ర పర్యావరణ శాఖ సరైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. పర్యావరణ అనుమతిపై 8 వారాల్లో నిర్ణయాన్ని తీసుకోవాలని గడువు విధించింది. -
భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు ‘గ్రీన్’ ట్రబుల్!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) తీవ్ర చిక్కుల్లో పడింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి జెన్కో పర్యావరణ అనుమతులు కోరితే మంజూరు చేయవద్దని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా ఆదేశించింది. ఈ ప్లాంట్‌కి పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని సోమవారం జరిగిన విచారణలో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఇంధన శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివాదాల నేపథ్యం... భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌ను ‘సబ్ క్రిటికల్’ బాయిలర్ టెక్నాలజీతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్తో జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అతి తక్కువ సమయంలో.. మార్చి 2015 నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. తర్వాత మూడు నెలలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లు నిర్మించాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను నిర్మించడం పట్ల తొలుత కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం తెలిపింది. అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని షరతులు విధించింది. అయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో అతితక్కువ కాలంలో నిర్మించాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బ్రాయిలర్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందకుండానే గతేడాది ఈ ప్లాంట్ నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. స్టేను ఉల్లంఘించి జెన్కో పనులను కొనసాగించడంతో కేంద్ర పర్యావరణ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదించారు. దీంతో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత నెల 7న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ నెల 5, 6వ తేదీల్లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఢిల్లీలో సమావేశమై దేశంలో నిర్మించనున్న కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు పర్యావరణ అనుమతులు జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశంలోనే భద్రాద్రి ప్లాంట్‌కి కూడా అనుమతుల అంశాన్ని పరిశీలించే విధంగా కేసు విచారణను ఈ నెల 17 నుంచి ముందుకు జరపాలని జెన్కో చేసిన విజ్ఞప్తి పట్ల ఎన్జీటీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎస్జీటీ విచారణ జరిపింది. డిసెంబర్ 14న పనులు ఆపేశామని, ఈ విషయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ తప్పుడు నివేదిక సమర్పించిందని జెన్కో వాదించింది. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పిస్తే తామే స్వయంగా విచారణ జరిపించి వాస్తవాలు తేలుస్తామని ఎన్జీటీ పేర్కొంది. అప్పటి వరకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు తెలిసింది. -
శివాజీ స్మారకానికి లైన్ క్లియర్
ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా త్వరలోనే పనులు ప్రారంభం సాక్షి, ముంబై: నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ భారీ స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్మారకం పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇదివరకే రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల నుంచి అనుమతులు లభించడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. గత ఏడు నెలలుగా అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖ వద్ద ఈ ప్రతిపాదన పెండింగులో ఉంది. ఇటీవల ఆ శాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు త్వరలో అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అది నెరవేర్చడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ అనుమతికి సంబంధించిన సర్క్యూలర్‌ను త్వరలో జారీ చేస్తామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన ఛత్రపతి శివాజీ స్మారకాన్ని అరేబియా సముద్రంలో నెలకొల్పాలని పదేళ్ల కిందటే ప్రతిపాదించారు. అందుకు బాంద్రా, మాహిం, శివాజీపార్క్, గేట్ వే ఆఫ్ ఇండియా తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. చివరకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ సముద్ర తీరంలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తీరం నుంచి కిలోమీటరు దూరంలో ఈ భారీ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకోవడం అనివార్యమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్-ఎన్సీపీ (డీఎఫ్ కూటమి) ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగడంవల్ల ఈ ప్రతిపాదన పెండింగులో పడిపోయింది. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి తమ మేనిఫెస్టోలో శివాజీ స్మారకం అంశాన్ని పొందుపరిచింది. ఆ తర్వాత 2009లో కూడా దీని ఏర్పాటుపై హామీ ఇచ్చింది. కాని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఈ ప్రతిపాదన పెండింగు దశలోనే ఉండిపోయింది. కాని ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శివాజీ స్మారకం ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. అనుమతివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. ఎట్టకేలకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి లభించడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.