కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మిస్తున్నారా? అని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ‘అమరావతి’పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రిత్విక్‌దత్తా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. కేవలం రాష్ట్ర స్థారుు పర్యావరణ అంచనా అథారిటీ ఇచ్చిన అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని దత్తా తెలిపారు. ‘ఏ’ క్యాటగిరీ కింద ఉన్న నిర్మాణాలు చేపట్టేటప్పుడు రాష్ట్ర స్థారుు పర్యావరణ అనుమతులు చెల్లవని, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.