పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం విషయంలో దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం పర్యావరణ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధి పెంచారా? అని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. దీనికి బదులుగా 36 లక్షల క్యూసెక్కుల వరద నుంచి 50 క్యూసెక్కులకు మార్పు చేశామన్న సమాధానం వినిపించింది. ఆపై అదనంగా ముంపు ఎంత పెరిగిందని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని న్యాయవాది బదులిచ్చారు. కాగా, ఈ వాదనతో పిటిషనర్ విభేదించారు. ముంపుతో విపత్తు ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొనటంతో.. సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా ఉన్న పిటిషన్ల కాపీలన్నీ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
పోలవరం ప్రాజెక్టు పరిధి పెంచారా?
Published Fri, Nov 10 2017 6:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
Advertisement