‘‘ప్రతి రాజకీయ పార్టీకి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేయాలని ఉంటుంది. మేమైనా అంతే. ఒక్కటన్నా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలను కుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం మా కాళ్లలో కట్టెలు పెడుతున్నాయి. భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భూసేకరణ జరగకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తాం?’’అని అధికార టీఆర్‌ఎస్‌లోని సీనియర్ నేత, మంత్రి ఇటీవల ప్రశ్నించారు. ఆ నేత మాటలకు తగినట్లుగానే ప్రతిపక్షా లను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. భూసేకరణను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం నేరుగా 12 కేసులు, పరోక్షంగా మరో 20 కేసులు వెరసి 32 కేసులను వేసిందని మంత్రి హరీశ్‌రావు అసెం బ్లీలో ఆరోపించారు.