కువైట్‌తో ‘పని మనుషుల’ ఒప్పందానికి కేబినెట్‌ ఓకే | Cabinet approves agreement with Kuwait to safeguard domestic workers | Sakshi
Sakshi News home page

కువైట్‌తో ‘పని మనుషుల’ ఒప్పందానికి కేబినెట్‌ ఓకే

Published Thu, Jan 24 2019 4:57 AM | Last Updated on Thu, Jan 24 2019 4:57 AM

Cabinet approves agreement with Kuwait to safeguard domestic workers - Sakshi

న్యూఢిల్లీ: పని మనుషుల నియామకంలో సహకారానికి కువైట్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల కువైట్‌లో పనిచేస్తున్న 3 లక్షల మంది భారతీయుల(అందులో 90 వేల మంది మహిళలే)కు ప్రయోజనం కలుగుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఎంఓయూలో భారత పని మనుషుల హక్కుల పరిరక్షణకు కొన్ని రక్షణలు కల్పించారు. ఐదేళ్ల వరకు అమల్లో ఉండే ఈ ఒప్పందాన్ని ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు సంయుక్త కమిటీని ఏర్పాటుచేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement